iDreamPost
android-app
ios-app

సీక్వెల్ తో రాబోతున్న అమృతం బ్యాచ్

  • Published Feb 22, 2020 | 11:07 AM Updated Updated Feb 22, 2020 | 11:07 AM
  • Published Feb 22, 2020 | 11:07 AMUpdated Feb 22, 2020 | 11:07 AM
సీక్వెల్ తో రాబోతున్న అమృతం బ్యాచ్

శాటిలైట్ టెలివిజన్ చరిత్రలో ఏ ఒక్కరు తిట్టుకోకుండా మనస్పూర్తిగా ఎంజాయ్ చేసిన అతి తక్కువ సీరియల్స్ లో అమృతంది ఫస్ట్ ర్యాంక్. చక్కని హాస్యంతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఎంటర్ టైన్మెంట్ తో కొన్నేళ్ల పాటు తెలుగువారి హృదయాల్లో తిష్టవేసిన ఈ సిరీస్ తర్వాత ఆగిపోవడం ఎందరో కామెడీ లవర్స్ ని బాధ పెట్టిన మాట వాస్తవం. టైటిల్ రోల్ శివాజీ రాజా, సీనియర్ నరేష్, హర్ష వర్ధన్ ఇలా ఎవరు చేసినా వినోదానికి లోటు లేకుండా చూసుకున్న అమృతం ఇప్పుడు సీక్వెల్ తో రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రోగ్రెస్ ఉంది.

అన్ని పాత్రలు రిపీట్ అవుతున్నాయి. గుండు హనుమంతరావు ఈ లోకంలో లేనందున ఆ పాత్రను సీనియర్ నటులు ఎల్బి శ్రీరామ్ పోషిస్తున్నారు. అంటే ఒక్క అంజి మారతాడు తప్పించి అప్పాజీ, సర్వం అందరూ మళ్ళి పలకరిస్తారు. మార్చ్ 26 నుంచి ఇది జీ 5 ద్వారా అందుబాటులోకి రానుంది. టీవీ ఛానల్ లో టెలికాస్ట్ చేస్తారా లేక వెబ్ సిరీస్ తరహాలో జీ 5 లో మాత్రమే ఉంచుతారా అనే క్లారిటీ ఇంకా రాలేదు.

ఇది ఎప్పుడు వచ్చినా ఆదరించేందుకు ప్రేక్షకులు సిద్ధంగానే ఉంటారు. గతంలో వచ్చిన 300కు పైగా ఎపిసోడ్లను చాలా కాలం యుట్యూబ్ లో ఉంచిన అమృతం టీమ్ ఇటీవలే జీ5 తో ఒప్పందం కుదిరాక వాటిని పూర్తిగా తొలగించేసింది. ఒకవేళ ఎవరైనా చూడాలనుకున్నా దానికి సబ్స్క్రైబ్ కావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడీ కొత్త సిరీస్ కూడా అదే బాటలో వెళ్లే ఛాన్స్ ఉంది. చక్కని హాస్యపు జల్లు లాంటి అమృతం ఫస్ట్ పార్ట్ స్థాయిలో మెప్పిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మితిమీరిన మెలోడ్రామా, లేడీ విలనిజం సీరియళ్ళతో విసుగెత్తిపోయిన ప్రేక్షకులకు అమృతం ఎలాంటి ఆనందాన్ని ఇస్తుందో వేచి చూడాలి

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet