iDreamPost
android-app
ios-app

Brahmastra బ్ర‌హ్మ‌స్త్ర రిజ‌ల్ట్ ను అమితాబ్ ముందుగానే చెప్పేశారా? అందుకే రిషూట్ చేశారా?

  • Published Sep 04, 2022 | 12:40 PM Updated Updated Sep 04, 2022 | 12:47 PM
Brahmastra బ్ర‌హ్మ‌స్త్ర రిజ‌ల్ట్ ను అమితాబ్ ముందుగానే చెప్పేశారా? అందుకే రిషూట్ చేశారా?

కరణ్ జోహార్-అయాన్ ముఖర్జీల బ్ర‌హ్మ‌స్త్ర మూవీ రిజ‌ల్ట్ ను చాలా ముందుగానే అమితాబ్ బచ్చన్ అంచ‌నా వేశారా? అందుకే కొత్త‌గా చాలా సీన్స్ ను షూట్ చేసి యాడ్ చేశారా? రిషూట్స్ కూడా చేశారా? రణబీర్ కపూర్-ఆలియా భట్ మ‌ధ్య సీన్స్ ను రీషూట్ చేయ‌డ‌మేకాదు, త‌న‌తో మ‌రికొన్ని స‌న్నివేశాల‌ను తీయ‌డానికి లెజండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ కాల్ షీట్స్ ఇచ్చారు.

బ్ర‌హ్మాస్త్ర చుట్టూ పెద్ద వ్యాపారామే నడుస్తోంది. క‌నీసం 600-700 కోట్ల రుపాయిల క‌లెక్ష‌న్స్ వ‌స్తేకాని నిర్మాత క‌ర‌ణ్ జోహార్ రుపాయి లాభం చూడ‌లేరు. అందుకే నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ బ్రహ్మాస్త్ర హిట్ కి చాలా అవసరమని అమితాబ్ న‌మ్మారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌నిచేశారు.

బాయ్ కాట్ బాలీవుడ్ దెబ్బ‌కు బాగా న‌ష్ట‌పోయిన వారిలో క‌ర‌ణ్ జోహార్ కూడా ఒక‌రు. ఆయ‌న ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అంటేనే చాలామంది మండిప‌డుతున్నారు. లైగ‌ర్ ను దెబ్బ‌తీసిన విష‌యాల్లో క‌ర‌ణ్ జోహార్ మీదున్న నెగిటివిటీకూడా ఒక‌టి. బ్రహ్మాస్త్ర కరణ్ జోహార్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌. 410 కోట్లకు పైగా ఖర్చు చేసినందున , ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మేకర్స్ ఎలాంటి అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌డంలేదు. బాహుబలికి హిందీలో కరణ్ జోహార్ ప్ర‌మోట్ చేసిన‌ట్లుగానే SS రాజమౌళి బ్ర‌హ్మ‌స్త్ర‌కు సౌత్ ఫేస్ గా మారారు. తెలుగులో జూనియ‌ర్ ఎన్టీయార్ కూడా రంగంలోకి దిగారు. అంతా బ్ర‌హ్మ‌స్త్ర హిట్ కోస‌మే.

మిగిలిన హిందీ సినిమాల‌క‌న్నా బ్ర‌హ్మ‌స్త్ర‌కు సుదీర్ఘ‌మైన షూటింగ్ అవ‌స‌ర‌మైంది. కొత్త సీన్స్ కోసం షెడ్యూల్ ను పొడిగించారు. ఇదంతా కరణ్ జోహార్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్. రాజ‌మౌళి స్టైల్. ముందు సినిమా ర‌షెస్ చూసిన త‌ర్వాత క‌ర‌ణ్ జోహార్ కు సంతృప్తి చెంద‌లేదు. కొత్త సీన్స్ కావాల‌ని, ఉన్న సీన్స్ ను కొన్నింటిని మార్చాలనుకున్నారు. రీషూట్ త‌ప్ప‌ద‌ని తేల్చిచెప్పారు. ఆమితాబ్ మాట కూడా అదే.

ముంబై స‌ర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిస్ ప్ర‌కారం, బ్ర‌హ్మ‌స్త్ర‌ డిజాస్టర్ అవుతుందని అమితాబ్ బచ్చన్ కరణ్ జోహార్‌ను హెచ్చరించారు. డైరెక్ష‌న్ బాగాలేద‌ని తేల్చిచెప్పారంట‌. షెడ్యూల్స్ బాగా లేట్ అవుతున్నాయ‌ని అన్నారు. అందుకే మొద‌ట్లో అమితాబ్ బచ్చన్‌కు సినిమా రిజ‌ల్ట్ మీద‌ కొన్ని సందేహాలు ఉన్నాయి. కాని డైరెక్ట‌ర్ అయాన్ ముఖర్జీ, నిర్మాత కరణ్ జోహార్‌తో చర్చించిన తర్వాత రీషూట్ లు మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాతే క‌ర‌ణ్ జోహార్ కి న‌మ్మ‌క‌మొచ్చి బ‌డ్జెట్ పెంచారు. షూటింగ్ షెడ్కూల్ లేట‌యినా ప‌ర్వాలేద‌నుకున్నారు. క‌ర‌ణ్ జోహార్ కి అమితాబ్ మ‌ద్ద‌తునిచ్చారు.

బ్ర‌హ్మాస్త్ర హిట్ కొడుతుంద‌ని అమితాబ్ బచ్చన్ చాలా పాజిటీవ్ గా ఉన్నారు. ఐదేళ్ల‌పాటు ఒక సినిమాకు ప‌నిచేయ‌డ‌మంటే మాట‌లా? రణబీర్ కపూర్, అలియా భట్‌లు త‌మ మిత్రుడైన డైరెక్ట‌ర్ అయాన్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు.