iDreamPost
android-app
ios-app

బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ సీఎం: అమిత్ షా

  • Published Oct 27, 2023 | 9:44 PM Updated Updated Oct 27, 2023 | 9:44 PM

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తుంది. ప్రధాన పార్టీ నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తుంది. ప్రధాన పార్టీ నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ సీఎం: అమిత్ షా

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ముమ్మర ప్రచారాలు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వరుస ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ములుగు నుంచి బస్సు యాత్రతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాజాగా బీజేపీ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా.. సూర్యపేట బహిరంగ సభలో ప్రచారం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధినేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రంగంలోకి దిగుతున్నారు. ఓ వైపు అధికార పార్టీ నుంచి సీఎం రంగంలోకి దిగితే.. ప్రతిపక్ష పార్టీ తరుపు నుంచి జాతీయ నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం సూర్యపేటలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హూంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే.. ప్రజల సంక్షేమం పట్టదు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుంది.. ఇక దానికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది అన్నారు.

తెలంగాణ అభివృద్ది విషయంలో ప్రధాని మోదీ అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. తెలంగాణతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. వరంగల్ లో సమ్మక్క-సారక్క ట్రైబల్ వర్సీటీ ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. పసుపు రైతుల కోసం బోర్డు ఏర్పాటు చేశారు.. కృష్ణ నీళ్లలో తెలంగాణ హక్కుల కోసం ట్రిబ్యూనల్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా సంక్షేమం కోసం కాదు.. సొంత కుటుంబ సంక్షేమం కోసమే పాటుపడతారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ గాంధీ కుటుంబ పాలన నడుస్తుంది.

తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి ఛాన్సు ఇవ్వండి.. దేశం గర్వించేలా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తాం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో దళితులకు సీఎం సీటు ఇస్తామని వాగ్ధానం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనే సీఎం పీఠం ఎక్కారు.. తర్వాత ఆయన కుటుంబానికి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి హామీ ఏమైంది? ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలి. బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం’ అని అన్నారు.