Idream media
Idream media
2020 జనవరి 30 భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కొత్త వైరస్ పై భయం మొదలైన రోజు. కేంద్రం ఎప్పటికప్పుడు తగిన భరోసా కల్పిస్తూ వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు మార్చిలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. పది, ఇరవై రోజులు కాదు.. దాదాపు మూడు నెలల పాటు దేశ వ్యాప్తంగా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. జూన్ నుంచి దశల వారీగా అన్ లాక్ చేసినప్పటికీ లాక్ డౌన్ దెబ్బకు అన్ని రంగాలూ విలవిలలాడిపోయాయి.
పరిశ్రమలే కాదు… ప్రభుత్వాలే అల్లాడిపోయాయి. ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి. ఇప్పటికీ దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది. అందుకు కారణం కోట్లాది రూపాయల సంపద ఆవిరైపోయింది. కానీ.. కరోనా కాలంలో కూడా కుబేరుల సంపద మాత్రం అంతకంతకూ పెరిగింది.
వారి సంపద లక్షల కోట్లకు రెట్టింపయింది. తాజా లెక్కలను పరిశీలిస్తే ఆశ్చర్యపోవడం సామాన్యుల ఒంతవుతుంది. అందులో ప్రధానంగా ఆదానీ గ్రూప్ ఆస్తుల విలువ ఏకంగా 5 లక్షల కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
Also Read : కెప్టెన్ కొత్త పార్టీ.. అమిత్‌షాను కలిసిన మరుసటి రోజే ప్రకటన
దేశంలో కరోనా కొన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టినా కుబేరుల సంపద మాత్రం భారీగా పెరుగుతోండటం విశేషం. ఇండియాలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఉన్న గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం సంపద విలువ గత ఏడాదిలో ఏకంగా 261శాతం పెరిగింది. రోజువారీగా చూస్తే వెయ్యి కోట్లు పెరిగిందని IIFL Wealth-Hurun India Report ప్రకటించింది. తొలిసారి అదానీ సోదరులిద్దరూ ఈ జాబితాలో టాప్-10లో నిలిచారు. ఇక దేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకేశ్ అంబానీ గతేడాదిలో రోజువారీగా 169 కోట్లు మాత్రమే వృద్ధి చెందారు.
ముకేశ్ ఆస్తుల విలువ గతేడాది 9శాతం పెరిగి 7 లక్షల 18 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. గతేడాది లక్షా 40 వేల 200 కోట్ల రూపాయలుగా ఉన్న గౌతమ్ అదానీ కుటుంబం ఆస్తుల విలువ.. ఏకంగా 5లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. హెచ్‌సీఎల్ గ్రూప్ అధినేత శివనాడార్, ఆయన కుటుంబం సంపద విలువ కూడా భారీగానే పెరిగింది. గతేడాదితో పోలిస్తే వారి సంపద విలువ 67శాతం పెరిగినట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ నివేదిక ప్రకారం వారి సంపద నిత్యం 260 కోట్ల రూపాయలు పెరుగుతోంది.
దేశంలో కుబేరుల్లో మూడో స్థానంలో హెచ్‌సీఆర్ గ్రూప్ ఆస్తుల విలువ 2 లక్షల 36 వేల కోట్ల రూపాయలు. ఇక ఐదో స్థానంలో నిలిచింది మిట్టల్ ఫ్యామిలీ. లక్ష్మీనివాస్ సహా ఆయన ఫ్యామిలీ ఆస్తుల విలువ కోటి 74 వేల కోట్ల రూపాయలు. గతేడాది వారి సంపదలో 187శాతం పెరుగుదల కనిపించింది. మిట్టల కుటుంబం రోజువారీ సంపద వృద్ధి 312 కోట్ల రూపాయలు. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత పూనావాలా కుటుంబం ఆస్తుల విలువ గతేడాది 74 శాతం పెరిగింది.
Also Read : భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కోసం కాదు.. అంతకుమించి…