Idream media
Idream media
చేసే పనిలో చిత్తశుద్ధి లోపిస్తే.. ఫలితం ఉండదని అమరావతి పరిరక్షణ సమితి కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ షర్మిళ ఇంటి ముందు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. కృష్ణా జిలాల విషయంలో షర్మిళ వైఖరి చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే వైఎస్ షర్మిళ తన స్టాండ్ ఏమిటో స్పష్టంగా వెల్లడించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిళ.. తెలంగాణలో యాక్టివ్‌గా రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జలాల వివాదంపైనా స్పందించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను వదులుకోబోమని, ఇందుకోసం ఎవరితోనైనా కొట్లాడతామని స్పష్టం చేశారు.
అయితే అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు.. వైఎస్ షర్మిళ చేసిన ప్రకటన వల్ల రాయలసీమ రైతులకు అన్యాయం చేసేలా ఉందంటూ ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారిని షర్మిళ అనుచరులు అడ్డుకున్నారు. అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి సభ్యులను షర్మిళ అనుచరులు తోసివేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. దాడి చేస్తారేమోనన్న భయంతో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు పరుగులు తీశారు.
అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు చేసిన ఈ కార్యక్రమం రాజకీయ రచ్చ కోసం చేసినట్లుగా ఉంది కానీ.. రాయలసీమ హక్కుల కోసం కాదని ఘంటాపథంగా చెప్పవచ్చు. తెలంగాణ లో పార్టీ పెట్టిన షర్మిళ.. ఆ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడతారు. ఆమె కాదు.. తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు అలానే మాట్లాడతారు. అయితే షర్మిళ చేసిన ప్రకటన వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడడమే విడ్డూరంగా ఉంది.
Also Read : వ్యాక్సిన్ దందాను ఆపాడంలో జగన్ సక్సెస్
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి మూడు రాజధానులను ప్రతిపాదిస్తే.. వ్యతిరేకిస్తూ 500 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితికి ఇప్పుడు కృష్ణా జిలాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే విషయం గుర్తుకురావడం వింతగా ఉంది. న్యాయ రాజధానిలో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలిస్తామంటే.. ససేమిరా అంటున్న అమరావతి ఉద్యమకారులు.. ఇప్పుడు రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
కృష్ణా జలాల వివాదంపై తెలంగాణలోని అన్ని పార్టీలు మాట్లాడాయి. మరి ఆయా పార్టీల కార్యాలయాలు, నేతలు ఇళ్ల వద్ద అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఎందుకు ఆందోళన చేయరనే ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు..? రాయలసీమకు అన్యాయం జరగకూడదనే భావన అమరావతి పరరిక్షణ సమితి సభ్యుల్లో ఉంటే.. ముందు ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలి. రాయలసీమకు అన్యాయం చేయొద్దంటూ కేసీఆర్‌కు వినతిపత్రం ఇవ్వాలి. అలాగే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలను కలిసి కృష్ణా జలాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరగనీయొద్దంటూ విన్నవించాలి. తెలంగాణ హక్కులను కాపాడుకుంటూనే.. రాయలసీమకు అన్యాయం చేయొద్దనేలా అసెంబ్లీలో మాట్లాడాలని కోరాలి. ఇవేమీ చేయకుండా నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ, కనీసం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని పార్టీ నాయకురాలు ఇంటి ముందు ధర్నా చేయడం వెనుక లక్ష్యం ఏమిటో ఎవరికీ తెలియంది కాదు.
Also Read : ఎట్టకేలకు టిడిపి ఆఫీసు తెరిచారు !