iDreamPost
android-app
ios-app

Amaravati Movement, TDP Prakasam MLAs – అమరావతి ఉద్యమం.. ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు..

Amaravati Movement, TDP Prakasam MLAs – అమరావతి ఉద్యమం.. ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు..

అమ్మ ఒడి, నాడు నేడు పథకంతో స్కూళ్లు, ఆసుపత్రులు బాగు చేసుకోవటం, రైతు భరోసా, గతంలో సుమారు 35 లక్షలున్న పింఛన్లు నేడు దాదాపు 60 లక్షల మందికి ఇవ్వటం.. ఇలాంటి పథకాలు ఇంకో పది వరకు ఉంటాయి జగన్ సర్కార్ వచ్చాక అమలు చేస్తున్నవి. ఈ పథకాలకు తోడు తీర్చాల్సిన పాత బాకీలు.

మరో ముఖ్య విషయం కరోనా సమయం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నెలల తరబడి లాక్ డౌన్ లు. అంటే ఆదాయం పూర్తిగా సున్నా. ఈ పథకాల అమలుకి, జీతాలు ఇవ్వటానికి కిందా మీదా పడుతున్న ప్రభుత్వం. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సమయంలో అప్పులు ఎందుకు చేసారు అని ప్రశ్నిస్తున్న వారే అమరావతిలో ఖర్చు పెట్టమని అడగటం.

అమరావతికి మరో లక్ష కోట్లు అవసరం అని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ స్వయంగా చెప్పారు. అంటే అప్పులు తెచ్చి పై పథకాలన్నీ ఆపితే కానీ అమరావతి మీద ఖర్చు పెట్టలేదు ప్రభుత్వం. వెరీ గుడ్, వీరన్నట్లు అన్నీ ఆపేసి అమరావతిలో ఖర్చు పెట్టిందే అనుకుందాం. కొన్ని మీడియా సంస్థలు పదే పదే చూపిస్తున్న ఆగిపోయిన హై రైజ్ బిల్డింగ్స్ (ఎమ్మెల్యేల కోసం, ఐఏఎస్ అధికారులు కోసం) పూర్తి చేసి, ఆ పెద్ద రోడ్లు పూర్తి చేసింది అనే అనుకుందాం. ఏమయ్యేది! ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక్క అధికారి అయినా అక్కడ కుటుంబంతో వచ్చి కాపురం ఉండేవారా??.. కేవలం వాటిని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వారికి తప్ప ఎవరికైనా లాభం ఉందా?? 

Also Read : AP MLC Elections – మోగిన ఎమ్మెల్సీ నగారా.. ఎన్నిక లాంఛనమే.. వైసీపీలో సందడి

అసలు ఈ కరోనా సమయంలో ప్రభుత్వం పథకాల పేరుతో డబ్బుని ప్రజల్లోకి పంపకపోయి ఉంటే, కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదు మొత్తం వ్యవస్థ కూలబడేది. ఎన్నో సమస్యలు తలెత్తేవి. అమ్మఒడి లబ్ధిదారులు కానీ, ఆటో నడిపేవారు కానీ ఎవ్వరూ డాబాలు కట్టుకోలేదు, కోటీశ్వరులు అవ్వలేదు. వ్యవస్థ నడవటానికి డబ్బు సర్క్యులేట్ అయింది. మరి అదే అమరావతిలో ఖర్చు పెట్టి ఉంటే.. ఎవరు ఎంతమంది లాభపడేవారు??..

అమరావతి రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తలతో రైతుల వేషం వేయించి.. జెండాలు పట్టించి ఈరోజు రోడ్ల మీదకొచ్చి సొంత పార్టీ కార్యక్రమాన్ని నడుపుతూ నాటకానికి తెర లేపిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం నాయకులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా??..

గత ప్రభుత్వంలో తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడి.. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి.. అక్రమంగా వేలకోట్ల రూపాయల ఆస్తులను పోగేసుకున్న తమ నాయకుడు.. ఆయన బంధువులు.. బినామీలు.. సొంత మీడియా సంస్థల ఆస్తులను కాపాడుకోవడానికి సృష్టించిన కృత్రిమ ఉద్యమం తప్ప.  ఇంతకు మించి ఈ ఉద్యమంలో ఇసుమంత కూడా నిజాయితీ లేదని సామాన్య ప్రజానీకానికి అర్దమయ్యి మీ ఉద్యమాన్ని తిరస్కరించినా.. భాద్యతాయుతమైన ప్రతిపక్షంగా రాష్ట్రంలో అసలు ప్రజాసమస్యలు గాలికొదిలేసి.. మీ సొంత పార్టీ క్యాడర్ తో మీరు చేయిస్తున్న ఈ కృత్రిమ ఉద్యమాల అసలు అజెండా ఎంటో జనానికి తెలియనిదా?.  చివరికి మీ స్వార్ధం కోసం దేవుళ్ళను కూడా వదిలిపెట్టలేదంటే ఏమనుకోవాలి?.  ఇది ఇలానే కొనసాగితే అంతిమంగా దీనివల్ల మీరనుకున్న లక్ష్యం నెరవేరకపోగా.. రాజకీయంగా మరో దారుణమైన పరభావాన్ని మూట గట్టుకోవడం ఖాయం!. 

Also Read : AP Seed Policy – ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. కొత్త పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం..