iDreamPost
iDreamPost
అమరావతి పరిరక్షణ సమితి నేతలు నేడు కడప జిల్లాకు రానున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ప్రతిపక్ష పార్ఠీ టిడిపి దీన్ని రాద్దాంతం చేస్తోంది. కేవలం అమరావతిలోనే రాజధాని పెట్టడం వల్ల ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందవని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అందుకే రాష్ట్రమంతా అభివృద్ధి చెందేందుకు తాజాగా మూడు రాజధానుల అంశంపై అద్యయనం చేసేందుకు కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఈమేరకు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగుతున్నారు. ఈరోజు కడపకు వస్తున్న ఈ సమితి నేతలు పది గంటలకు కడప పార్లమెంట్ ఐకాసా నేతలతో సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంలో ఎంతమేరకు నేతలు పాల్గొంటారో తెలియాల్సి ఉంది. ఎందుకంటే రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అన్ని జిల్లాలను సమాన స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కడప జిల్లాలో ఈ ఐకాసా పర్యటన ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.