iDreamPost
iDreamPost
పండగ సీజ్ మిస్ కాకూడదన్న ఉద్దేశంతో ముందు ప్రకటించింద డేట్ ని వద్దనుకుని మరీ ఒక రోజు ముందు విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ టాక్ పరంగా బెదుర్స్ అనిపించినా సెలవు రోజుని బాగా వాడుకుని చెప్పుకోదగ్గ వసూళ్లే రాబట్టింది. మిగిలిన మూడు పోటీ సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ ఇక్కడ హీరో రేంజ్ ని మర్చిపోకూడదు.
భారీగా చేసిన పబ్లిసిటీతో పాటు బడ్జెట్ పరంగానూ ట్రైలర్ లో చాలా రిచ్ గా కనిపించడంతో మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ వర్గాలు కూడా దీని మీద ఓ లుక్ వేద్దామని డిసైడ్ అయ్యాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ దీనికి చాలా హెల్ప్ అయ్యాయి. అధికారికంగా రాకపోయినా ట్రేడ్ నుంచి వివిధ మార్గాల్లో తెలుస్తున్న సమాచారం మేరకు అల్లుడు మొదటి రోజు సుమారు 2 కోట్ల 80 లక్షల దాకా షేర్ రాబట్టాడు. ఏరియాల వారీగా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి
– ఏరియా వారీగా మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 1.14cr |
సీడెడ్ | 0.61cr |
ఉత్తరాంధ్ర | 0.40cr |
గుంటూరు | 0.172cr |
క్రిష్ణ | 0.07cr |
ఈస్ట్ గోదావరి | 0.10cr |
వెస్ట్ గోదావరి | 0.21cr |
నెల్లూరు | 0.06cr |
Total Ap/Tg | 2.76cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.05cr |
ఓవర్సీస్ | 0.03cr |
ప్రపంచవ్యాప్తంగా | 2.85cr |
ఇప్పుడు వచ్చిన టాక్, రెస్పాన్స్ ని బట్టి చూస్తే అల్లుడు అదుర్స్ రేస్ లో లాంగ్ రన్ నిలవడం కష్టమే అనిపిస్తోంది. ఒక్కకంటే ఒక్క పాజిటివ్ మాట దీని గురించి బయటికి రావడం లేదు. దాదాపు రివ్యూలన్నీ గట్టిగా నిలదీశాయి. కంటెంట్ లేకుండా ఉట్టి గ్యాస్ తో నింపిన ఈ మాస్ ఎంటర్ టైనర్ ఎన్ని రోజులు సస్ టైన్ అవుతుందన్న దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ డిసైడ్ అవుతుంది. సెలవులు ఇంకో రెండు రోజులు ఉంటాయి కాబట్టి మరీ విపరీతమైన డ్రాప్ ఉండకపోవచ్చు కానీ ఆపై వచ్చే సోమవారం నుంచి అసలు సవాల్ మొదలవుతుంది. ఈలోగా ఎంత రాబట్టుకుంటే అంత గండం తగ్గుతుంది. లేదంటే కష్టమే