iDreamPost
iDreamPost
పాన్ ఇండియా సినిమాకు ఆద్యులు శంకర్, రాజమౌళీయే. రాజమౌళి పాన్ ఇండియా సినిమా సక్సెస్ కు ఒక టాంప్లెట్ రెడీ చేస్తే, అల్లు అర్జున్ పుష్ప సినిమా హిందీ మార్కెట్ ను ఎలా గెల్చుకోవాలో చేసి చూపించింది. పుష్ప మాట, మ్యానిరిజం, నడక అన్నీ తెలుగు కన్నా, హిందీలోనే ఐకానిక్ అయిపోయాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ – పార్ట్ 1(Pushpa: The Rise) బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్. డిసెంబర్‌లో రిలీజైన పుష్ప పాన్-ఇండియన్ హిట్‌గా నిలిచింది. హిందీ వెర్షన్ కూడా కలెక్షన్స్ కురిపించింది. అంతకుమించి పుష్ప సిగ్నేచర్ వాక్ , మేనరిజమ్, డైలాగ్స్ వరకు సినిమాకు సంబంధించి ప్రతిదీ ఒక ట్రెండ్. ఇలా పుష్ప అల్లు అర్జున్‌ను పాన్-ఇండియా స్టార్‌గా మార్చేసింది. లేటెస్ట్ గా అల్లు అర్జున్ సౌత్ స్వాగ్ అంటూ ఇండియా టుడే కవర్‌పై కనిపించారు. ఇండియా టుడేతో కుడివైపు వంగినట్లు నడిచే స్టైల్ ఎలా పుట్టిందో అల్లు అర్జున్ చెప్పాడు.
అందరికీ హీరోల కన్నా డిఫరెంట్ గా నడవాలన్నది దర్శకుడు సుకుమార్(Sukumar) ఆలోచన. మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు, సినిమా రిలీజ్ తర్వాత అందరూ మీలాగే నడవాలని సుకుమార్ చెప్పాడు. అందుకే భుజాన్ని కాస్త వాలుగా ఉంచి నడిచే బాడీ లాంగ్వేజ్ సుకుమార్ సజెస్ట్ చేశారు. ఈ నడకను ఎవరైనా ఫాలో కాలగరని అనిపించదని అల్లు అర్జున్ వెల్లడించారు.
సినిమా విడుదలకు ముందే, శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ నడిచే స్టైల్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. వాకింగ్ స్టైల్ మాత్రమే కాదు, తగ్గేదిలే అనే డైలాగ్ చెబుతూ పుష్ప చేసే మేనరిజంకూడా అందరికీ తెగ నచ్చేసింది. జనాలు ఇప్పటికీ అలాగే చేస్తున్నారు.
ఇప్పుడు అందరూ పుష్ప: ది రూల్ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మదన్న, ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు విజయ్ సేతుపతి సిద్దమని అంటున్నారు. కాని ఇంకా అధికార ప్రకటన రావాల్సింది.
పుష్ప షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా 2023కి వాయిదా పడింది. పుష్ప భారీ హిట్ కొట్టడంతో డైరెక్టర్ సీక్వెల్ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దారు. ఈసారి సినిమా కలెక్షన్స్ టార్గెట్ వెయ్యికోట్లు. కేజీఎఫ్ కొట్టి చూపించిందికాబట్టి, టాలీవుడ్ నుంచి మరో వెయ్యికోట్ల హీరో వచ్చినట్లే.