iDreamPost
iDreamPost
ఇవాళ శాండల్ వుడ్ హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా కెజిఎఫ్ 2 యూనిట్ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అందులో పెద్ద విశేషం లేదు కానీ రిలీజ్ డేట్ ని మరోసారి ఏప్రిల్ 14ని కన్ఫర్మ్ చేస్తూ అందులో పేర్కొన్నారు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కూడా అదే తేదీని లాక్ చేసుకుంది కాబట్టి ఏమైనా మార్పు ఉండొచ్చేమోననే అనుమానాలు బ్రేక్ చేస్తూ పూర్తి స్పష్టత ఇచ్చేసింది. ఇప్పుడంటే ఓమిక్రాన్ తాలూకు కలకలం కనిపిస్తోంది కానీ కెజిఎఫ్ 2 కి ఇంకా మూడు నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి అప్పటికంతా పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే హోంబాలే ఫిలింస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు.
మొన్న వాయిదా పడిన ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు ఏప్రిల్ లో రావొచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో అది ఎంత వరకు సాధ్యమో అని ఆలోచిస్తే కష్టమేననే సమాధానమే దొరుకుతుంది. ఏప్రిల్ 1 మహేష్ బాబు సర్కారు వారి పాట ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల పోస్ట్ పోన్ అయినా ఆ నెలలోనే ఇంకో డేట్ కి రావడం మాత్రం పక్కా. విజయ్ బీస్ట్ కూడా రెండో వారం మీద కన్నేసింది. అఫీషియల్ గా మంత్ చెప్పారు కానీ తేదీ ఫైనల్ చేయలేదు. ఎఫ్3 ఆల్రెడీ ఏప్రిల్ 29కి ఫిక్స్ చేశారు. నితిన్ మాచర్ల నియోజకవర్గం ఇన్ని తిమింగలాల మధ్య ముందు చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం.
సో మొత్తానికి ఆ నెలలో చాలా టైట్ సిచువేషన్ అయితే కనిపిస్తోంది. బాలీవుడ్ సినిమాలు రాకెట్రీ, దక్కడ్, భేడియా, హీరోపంటి 2, రన్ వే 34 కూడా ఏప్రిల్ లోనే షెడ్యూల్ అయ్యాయి. వీటిని కాదని ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లకు ఆయా నిర్మాతలు స్పేస్ ఇవ్వడం అనుమానమే. సంక్రాంతికి చేసిన త్యాగమే ఎక్కువని ఇప్పటికే కొందరు ప్రొడ్యూసర్లు రాజమౌళి వ్యవహారం మీద గుర్రుగా ఉన్నారు. దానికి కారణం ఏదైనా ప్రస్తుతానికి ఇది నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏప్రిల్ లో అందరికంటే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది మాత్రం ముమ్మాటికి కెజిఎఫ్ 2కే. అందుకే చాలా స్పష్టంగా నో ఎంట్రీ బోర్డు చూపిస్తున్న తరహాలో ఏప్రిల్ రిలీజ్ ని మళ్ళీ కన్ఫర్మ్ చేశాడు
Also Read : Tollywood : నిరాశపరిచిన కొత్త ఏడాది తొలి బోణీ