iDreamPost
android-app
ios-app

Yash: యశ్‌ 19వ సినిమా టైటిల్‌ అదిరిపోయింది!

  • Published Dec 08, 2023 | 10:05 AM Updated Updated Dec 08, 2023 | 10:18 AM

యశ్‌ కేజీఎఫ్‌ సినిమాల తర్వాత దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం కథలు వినడానికే కేటాయించారు. తాజాగా, యశ్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చింది...

యశ్‌ కేజీఎఫ్‌ సినిమాల తర్వాత దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం కథలు వినడానికే కేటాయించారు. తాజాగా, యశ్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చింది...

  • Published Dec 08, 2023 | 10:05 AMUpdated Dec 08, 2023 | 10:18 AM
Yash: యశ్‌ 19వ సినిమా టైటిల్‌ అదిరిపోయింది!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ యశ్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆయన కొత్త సినిమా టైటిల్‌ అనౌన్స్‌ అయింది. కొద్దిరోజుల క్రితం యశ్‌ 19వ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ వచ్చింది. అయితే, మూవీ టైటిల్‌ మాత్రం అనౌన్స్‌ చేయలేదు. డిసెంబర్‌ 8వ తేదీ శుక్రవారం సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9.55 నిమిషాలకు టైటిల్‌ అనౌన్స్‌ అయింది. ఈ మేరకు చిత్రం బృందం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను విడుదల చేసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యశ్‌ 19వ సినిమాకు ‘‘ టాక్సిక్‌ ’’ అన్న పేరు ఖరారు చేశారు.  ‘‘ ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’’ అన్న ట్యాగ్‌లైన్‌ను కూడా పెట్టారు. ఇది టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ అయినప్పటికి ఆ వీడియోలో యశ్‌ లుక్‌ను కూడా రివీల్‌ చేసినట్లు ఉన్నారు. టాక్సిక్‌ పేరు బ్యాక్‌గ్రౌండ్‌లో తుపాకితో ఉన్నారు. ఇక, ఈ చిత్రాన్ని కేవీన్‌ఎన్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తోంది. ఈ మూవీ తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

టాక్సిక్‌ సినిమాకు గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, టాక్సిక్‌ హీరోయిన్‌తో పాటు ఇతర క్రూ వివరాలు వెల్లడికాలేదు. మరికొద్దిరోజుల్లో ఈ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా, కేజీఎఫ్‌ సినిమాలతో యశ్‌ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాకీ బాయ్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. దేశ వ్యాప్తంగా తనకంటూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పరుచుకున్నారు. ఇదే సమయంలో కేజీఎఫ్‌ 2 సాధించిన విజయంతో యశ్‌ భవిష్యత్తు ఓ సంవత్సరం కాలం పాటు అగమ్యగోచరంగా మారింది.

తన తర్వాతి సినిమా కేజీఎఫ్‌ చిత్రాలను మించి ఉండాలన్న ఉద్దేశ్యంతో కథల ఎంపిక కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పదుల సంఖ్యలో కథల్ని పక్కకు పడేశారు. దాదాపు సంవత్సరం నుంచి కథల్ని వింటూనే ఉన్నారు. ఫ్యాన్స్‌ అయితే, యశ్‌ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి అలసిపోయారు. సోషల్‌ మీడియా వ్యాప్తంగా అసహనం వ్యక్తం చేయసాగారు. యశ్‌ మాత్రం మంచి కథ కోసం వెతికి, వెతికి మానసికంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలాంటి సమయంలో టాక్సిక్‌ కథను యశ్‌ విన్నారు. ఆ కథ ఆయనకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశారు. మరికొద్దిరోజుల్లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. మరి, యశ్‌ 19వ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş