Venkateswarlu
కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తర్వాతి చిత్రాలు ఎన్టీఆర్ 31, కేజీఎఫ్ 3 సినిమాల గురించి ఆయన మాట్లాడారు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు షేరు చేసుకున్నారు.
కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తర్వాతి చిత్రాలు ఎన్టీఆర్ 31, కేజీఎఫ్ 3 సినిమాల గురించి ఆయన మాట్లాడారు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు షేరు చేసుకున్నారు.
Venkateswarlu
కేజీఎఫ్ సినిమాలతో సెన్సేషనల్ దర్శకుడిగా మారారు ప్రశాంత్ నీల్. ఈయనకు దేశ వ్యాప్తంగా సూపర్ స్టార్‌డమ్ వచ్చింది. కేజీఎఫ్ వన్‌ను మించి టు అద్భుత విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో ఆయన ‘సలార్’ మూవీని తెరెక్కెక్కించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ యశ్‌తో ఒక సినిమా.. జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండిటిలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం షూటింగ్ ముందు ప్రారంభం కానుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడి అంచనాలు పెంచేశారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నేను తీసిన చిత్రాలకు భిన్నంగా జూ.ఎన్టీఆర్ చిత్రం ఉంటుంది.
అభిమానులు ఇది భారీ యాక్షన్ చిత్రమని భావిస్తున్నారు. తారక్‌తో తీస్తున్న సినిమా జోనర్ ఏదైనా అది అందరికీ కనెక్ట్ అవుతుంది. 2024 ధ్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము’’ అని అన్నారు. ఆ మూవీకి సంబంధించిన కథ ఏ నేపథ్యంలో ఉంటుందనేది ఆయన రివీల్ చేయలేదు. యశ్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. ‘‘ కేజీఎఫ్ ఫ్రాంచైజీలో భాగంగా పార్ట్ 3 ఉంటుంది. యశ్ లేని కేజీఎఫ్ లేదు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయింది.
సీక్వెల్ చేయాలనే ఆలోచనతోటే కేజీఎఫ్ 2 సినిమా ఎండింగ్‌లో హింట్ ఇచ్చాం’’ అని అన్నారు. కాగా, ప్రభాస్ ‘సలార్’ మూవీ విషయానికి వస్తే.. ఇందులో హీరోయిన్‌గా శ్రుతిహాసన్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సలార్ ట్రైలర్ రికార్డులను క్రియేట్ చేసింది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నెల 15 నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు మూవీ మేకర్సు ప్రకటించారు.
ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో చిత్ర బృందం ప్రమోషన్లపై పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. దేశ వ్యాప్తంగా పలు ముఖ్య పట్టణాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్లు.. మీడియా ప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత సినిమా నేరుగా థియేటర్లలోకి రానుంది. మరి, త్వరలో పట్టాలెక్కనున్న ప్రశాంత్ నీల్ – తారక్ కాంబో సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.