iDreamPost
android-app
ios-app

ఇప్పుడంతా కీర్తి సురేష్ చేతుల్లోనే

  • Published Jun 17, 2020 | 5:04 AM Updated Updated Jun 17, 2020 | 5:04 AM
ఇప్పుడంతా కీర్తి సురేష్ చేతుల్లోనే

80 రోజులుగా మూతబడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచిస్తున్నట్టు కూడా కనిపించడం లేదు. ఎప్పటికి నిర్ణయం తీసుకుంటుందో పెద్దలకు సైతం అంతుచిక్కడం లేదు. అందుకే నిర్మాతలు కొందరు ఇక లాభం లేదని ఓటిటి వైపు చూడటం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా చూడాల్సిందే అని ముందే హైప్ తెచ్చుకున్న సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. జ్యోతిక తమిళ్ మూవీ పొన్మగళ్ వందాల్ కు యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి. ప్రేక్షకులు సైతం బ్రహ్మాండంగా ఉందని చెప్పినట్టు సోషల్ మీడియా దాఖలాలు లేవు.

ఇక అమితాబ్ బచ్చన్-ఆయుష్మాన్ ఖురానాల గులాబో సితాబో సైతం నిరాశ పరిచింది. బిగ్ బి పెర్ఫార్మన్స్ పరంగా ప్రశంసల జల్లులు కురిసినప్పటికీ కథా కథనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పెదవివిరుపులే ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో చాలా ముందే వచ్చేసిన చిన్న సినిమా అమృతరామమ్ ఫస్ట్ డేనే బోల్తా కొట్టింది. సత్య దేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వస్తేగాని కొంచెం ఊపోచ్చేలా లేదు. వీటి సంగతి పక్కన పెడితే ఈ నెల 19న విడుదల కాబోతున్న పెంగ్విన్ వైపే అందరి చూపు నిలుస్తోంది. తెలుగు తమిళ్ తో పాటు మలయాళంలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్రైలర్ కూడా మిలియన్లలో వ్యూస్ తెచ్చేసుకుంది.

ఈ లెక్కన పెంగ్విన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పెద్ద నెంబర్ లోనే ఉన్నారు. సైకో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన పెంగ్విన్ లో కీర్తి సురేష్ బిడ్డ తల్లిగా నటిస్తోంది. సస్పెన్స్ సినిమా కాబట్టి ఇందులో కమర్షియల్ అంశాలు ఉండవు. అయినా టైట్ స్క్రీన్ ప్లే తో మెప్పించగలిగేలా ఉంటే మాత్రం హక్కులు కొన్న ప్రైమ్ సంస్థకు పండగే. ఇప్పుడీ డిజిటల్ ఉద్యమం కీర్తి సురేష్ చేతుల్లోనే ఉంది. అసలే పేరున్న ఆర్టిస్టుల కొత్త సినిమాలు చూసి తెలుగు ఆడియన్స్ మొహం వాచిపోయి ఉన్నారు. పెంగ్విన్ లో ఏ మాత్రం విషయం ఉన్నా వాళ్ళకు ఊరట కలుగుతుంది. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందికలిగించే వయోలెన్స్ లాంటి అంశాలు ఉంటే కష్టమే కాని లేదంటే అమెజాన్ కు వ్యూస్ వర్షం ఖాయం. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన పెంగ్విన్ కి సంతోష్ నారాయన్ సంగీతం సమకూర్చారు