iDreamPost
android-app
ios-app

2022 రివ్యూ 4 – డెబ్యూ హీరోయిన్ల సందడి

  • Published Dec 24, 2022 | 4:48 PM Updated Updated Dec 24, 2022 | 4:49 PM
2022 రివ్యూ 4 – డెబ్యూ హీరోయిన్ల సందడి

ఇంకో వారంలో గుడ్ బై చెప్పనున్న 2022లో కొత్తగా తెరకు పరిచయమైన హీరోయిన్ల కబుర్లు చూద్దాం. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలుగులో సరైన ఎంట్రీ కోసం ఎదురు చూసిన ‘అలియా భట్’కు ఆర్ఆర్ఆర్ రూపంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ దక్కింది. ఆఫర్లు వస్తున్నప్పటికీ బాలీవుడ్ కమిట్ మెంట్స్ వల్ల ఒప్పుకోలేకపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ 30లో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజు రాణి డబ్బింగ్ మూవీతో మనకు తెలిసిన కేరళ కుట్టి ‘నజ్రియా’ అంటే సుందరానికితో రంగప్రవేశం చేసింది మరో మల్లువుడ్ భామ ‘సంయుక్త మీనన్’కు భీమ్లా నాయక్ ద్వారా ఎంట్రీ దొరికింది. ఆ తర్వాత బింబిసార రూపంలో పెద్ద హిట్టు అందుకుంది.

ధనుష్ సర్, సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో తనే హీరోయిన్. సీతారామంలో సీతగా అందం అభినయం రెండూ అద్భుతంగా ప్రదర్శించిన ‘మృణాల్ ఠాకూర్’లో నార్త్ దర్శకులు చూడలేని గొప్ప నటనా కోణాన్ని హను రాఘవపూడి ఆవిష్కరించాడు. దెబ్బకు చాలా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని టాక్. విజయ్ దేవరకొండ లైగర్ తో వచ్చిన ‘అనన్య పాండే’కు డెబ్యూనే దారుణమైన డిజాస్టర్ ఇచ్చింది. మరో భామ ‘షెర్లీ సెటియా’కు కృష్ణ వృందా విహారితో ప్రవేశం దక్కగా ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేక యావరేజ్ దక్కింది. ఓరి దేవుడాలో ‘మిథిలా పాల్కర్’ మెరిసింది కానీ వెంకటేష్ స్పెషల్ క్యారెక్టర్ చేసినా అది యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.

విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంతో ‘రితికా నాయక్’ పెర్ఫార్మన్స్ పరంగా ఆడియన్స్ దృష్టిలో మంచి మార్కులు తెచ్చుకుంది. వరుణ్ తేజ్ గనితో వచ్చిన ‘సయీ మంజ్రేకర్’కు డెబ్యూ తేడా కొట్టినా మేజర్ రూపంలో సక్సెస్ వరించింది. రామారావు ఆన్ డ్యూటీతో ఎంట్రీ ఇచ్చిన ‘రజీషా విజయన్’ టాలెంట్ నే నమ్ముకుంది. కార్తీ సర్దార్ లో తనని చూడొచ్చు. గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ ‘కావ్య కళ్యాణ్ రామ్’ మసూదలో చేసింది చిన్న పాత్రే అయినా గుర్తింపు తెచ్చుకుంది. కబాలి ఫేమ్ ‘సాయి ధన్సిక’ చేసిన తొలి స్ట్రెయిట్ మూవీ షికారు ఓటిటిలో బాగానే వెళ్ళింది. వీళ్ళు కాకుండా ఇంకొందరు పెద్దగా గుర్తింపు లేని సినిమాల్లో చేసిన వాళ్ళు చాలానే ఉన్నారు