iDreamPost
android-app
ios-app

డైలాగ్స్‌కి వహ్వా…..కానీ…..?(అల ట్రైలర్ రివ్యూ)

డైలాగ్స్‌కి వహ్వా…..కానీ…..?(అల ట్రైలర్ రివ్యూ)

ఇప్పటికే థమన్ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ఉర్రూతలూగిస్తున్న నేపథ్యంలో అల వైకుంఠపురంలో సినిమా క్రేజ్ పతాక స్థాయికి చేరుకుంటూ ఉంది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమాలో బన్నీ లుక్ కూడా అభిమానులను మెప్పించింది. మరి ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను అందుకుందా? సినిమా క్రేజ్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళే స్థాయిలో ట్రైలర్ ఉందా?

త్రివిక్రమ్ డైలాగ్స్ మాత్రం నిజంగా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అంతకుమించే ఉన్నాయి.‘నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది నాన్నా…..చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది’, ‘దేన్నైనా పుట్టిచ్చే శక్తి ఇద్దరికే ఉంది..ఒకటికి నేలకి….రెండు వాళ్ళకి….అలాంటోళ్ళతో గొడవేంటి…సరెండర్ అయిపోవడమే’…………..ఈ రెండు డైలాగ్స్‌లో ఉన్న మెస్సేజ్ మాత్రం ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. కోట్ల మందికి రీచ్ అయ్యే….చాలా మందిని ప్రభావితం చేసే సినిమాలో ఇలాంటి మాటలు చెప్పినందుకు త్రివిక్రమ్‌ని కచ్చితంగా అభినందించాలి. అలాగే స్టార్ హీరో అంటేనే భారీగా మేకప్, లేనిపోని బిల్డప్పులు, హీరో హంగామా కోసమే కోట్లాది రూపాయల ఖర్చు లాంటి న్యూసెన్స్ లేకుండా అల్లు అర్జున్ ఈ సారీ కాస్త నేచురల్‌గా కనిపించడానికి…..సహజంగా పెర్ఫార్మ్ చేయడానికి ఒప్పుకోవడం గొప్ప విషయమే. బాగుంది. బన్నీ డ్యాన్స్ మూవ్స్ కూడా బాగున్నాయి. థమన్ మ్యూజిక్ కూడా బాగుంది.

కాకపోతే ట్రైలర్‌లో కథేంటో….కనీసం బేసిక్ కాన్సెప్ట్ ఏంటో కూడా చెప్పే ధైర్యం త్రివిక్రమ్ చేయలేకపోవడం మాత్రం ఈ ట్రైలర్‌లో కనిపించే అతిపెద్ద మైనస్. కథ గురించి ఏం చెప్తే ఏమవుతుందో, అందరికీ తెలిసిపోతుందేమో అనే భయంతో ఎక్కడా ఏదీ రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. భారీ బడ్జెట్, పెద్ద పెద్ద నటులు, టాప్ రేంజ్ టెక్నీషియన్స్, త్రివిక్రమ్‌లాంటి రచయిత ఒక సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు అదే స్థాయిలో గొప్ప కథ ఉండాలని ఆశిస్తే అది ప్రేక్షకుడి తప్పవుతుందా? కనీసం 2020 ఇయర్ నుంచి అయినా బేసిక్ కథ, ఎమోషన్‌తోనే ఆసక్తి రేకెత్తించే స్థాయి కథలతో మన తెలుగు స్టార్స్ సినిమాలు తెరకెక్కుతాయేమో చూడాలిమరి.

ఆ ఒక్కటీ పక్కనపెడితే మాత్రం…. కథ కచ్చితంగా రొటీన్‌గా ఉండే అవకాశమే కనిపిస్తున్నప్పటికీ సంక్రాంతి పండగ టైంలో ఇంటిల్లిపాది వెళ్ళి థియేటర్‌లో రెండు గంటలపాటు ఆనందంగా కాలక్షేపం చేసే స్థాయి సినిమా ఇవ్వడానికి మాత్రం త్రివిక్రమ్ అండ్ టీం ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఫ్యామిలీ, లవ్, కామెడీ టచ్‌తో ఒక ఎంటర్టైనర్ తెరకెక్కించడంలో త్రివిక్రమ్ ఆల్రెడీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి అలాంటి విజయం త్రివిక్రమ్‌కి ఇచ్చేలానే కనిపిస్తోంది ‘అల వైకుంఠపురంలో’ ట్రైలర్.