వైకుంఠపురములో @ నాన్ బాహుబలి- 2 వారాల వసూళ్లు

సంక్రాంతి బరిలో పోటీ మధ్య దిగిన అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటే అంతకు మించి అనే స్థాయిలో ఏకంగా నాన్ బాహుబలి రికార్డులు తన పేరు మీద రాసుకుంటోంది. రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడోవారంలో అడుగుపెట్టే నాటికి 135 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ ని వసూళ్ల వర్షంలో ముంచెత్తింది. ఇప్పటిదాకా స్లో అవ్వకుండా ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తున్న ఈ చిత్రం ఇప్పట్లో తగ్గేలా లేదు. దాని తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది బన్నీ టీమ్.

ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు ఇతర కమర్షియల్ సినిమాలకు అంత ఈజీగా సాధ్యం కానీ రికార్డులు నమోదు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా నాన్ బాహుబలి పేరిట ఉన్న సాహో, సైరా, రంగస్థలం, ఖైదీ నెంబర్ 150 రికార్డులు స్మాష్ అయిపోయాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్ కి తోడు త్రివిక్రమ్ మాటల మాయాజాలం దర్శకత్వ ప్రతిభ మరోసారి ఈ కాంబినేషన్ కు హ్యాట్రిక్ అందించాయి. ఇంకో రెండు మూడు వారాలు ఇదే జోరు కొనసాగిస్తే అల వైకుంఠపురములో సులువుగా అందనంత ఎత్తులో నిలవడం ఖాయం. ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

ఏరియా వారి 2 వారాల వసూళ్లు :

AREA SHARE
Nizam 34.00cr
Ceded 17.20cr
UA 17.30cr
Guntur 8.85cr
Krishna 8.40cr
East 8.70cr
West 7.75cr
Nellore 3.75cr
AP/TG 106cr
Karnataka +ROI  11.20cr
Overseas  17.75cr
TOTAL WORLDWIDE  134.90cr

– ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ( నాన్ బాహుబలి) 

( GST రిటర్న్స్ మినహా)

Show comments