iDreamPost
android-app
ios-app

తొలిరోజు “అలరించిన” వైకుంఠపురములో

  • Published Jan 13, 2020 | 11:49 AM Updated Updated Jan 13, 2020 | 11:49 AM
తొలిరోజు “అలరించిన” వైకుంఠపురములో

స్టైలిష్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే అల్లు అర్జున్ సంక్రాంతి సినిమా అల వైకుంఠపురములో ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది. నా పేరు సూర్య ఫలితం నిరాశ పరిచాక ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని బన్నీ చేసిన ఈ మూవీ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తగ్గ ఫలితాన్ని అందుకుంది. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత అరవింద సమేత వీర రాఘవతో సక్సెస్ ఆందుకున్నప్పటికి దర్శకుడు త్రివిక్రమ్ తన స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూసాడు. ఇప్పుడు అల వైకుంఠపురములో ద్వారా మరోసారి తన మేజిక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. తమన్ సంగీతం విడుదలకు ముందే చార్ట్ బస్టర్ గా నిలవగా ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుత స్పందన తెచ్చుకుంటోంది. మొదటిరోజే సుమారు 24.70 కోట్ల దాకా ఆంధ్రా,తెలంగాణలో షేర్ వచ్చినట్టుగా ట్రేడ్ సమాచారం. మరిన్ని సంచలనాల దిశగా అల వైకుంఠపురములో దూసుకెళ్లడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఏరియా వారీగా మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

AREA SHARE
నైజాం  5.80cr
సీడెడ్   3.15cr
ఉత్తరాంధ్ర  3.20cr
గుంటూరు   3.40cr
క్రిష్ణ   2.60cr
ఈస్ట్ గోదావరి  2.70cr
వెస్ట్ గోదావరి  2.80cr
నెల్లూరు   1.05cr
టోటల్ ఆంధ్ర/తెలంగాణ  24.70cr