iDreamPost
iDreamPost
తమిళ బ్లాక్ బస్టర్ రట్ససన్ కు రీమేక్ గా తెలుగులోనూ సూపర్ హిట్ అయిన రాక్షసుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు పెద్ద హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. వచ్చి మూడేళ్లు దాటినా ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి రేటింగ్స్ సాధిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవలే హిందీలో అక్షయ్ కుమార్ తో తీశారు. కట్ పుత్లీ పేరుతో రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ముందు థియేటర్ కోసం ప్లాన్ చేసుకున్నారు కానీ మతిపోయే రేంజ్ లో 180 కోట్ల డిజిటల్ ప్లస్ శాటిలైట్ డీల్ రావడం ఇంకేమి ఆలోచించకుండా ఓటిటి డైరెక్ట్ ప్రీమియర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదెంత మంచి పని అయ్యిందో నిర్మాతకు అర్థమవుతోంది.
కట్ పుత్లీకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ఒరిజినల్ వెర్షన్ తో పోల్చిన వాళ్ళు పెదవి విరుస్తుండగా నేరుగా దీన్నే చూసిన వాళ్ళు సైతం ఇందులో అంతగా ఏముందని సోసో ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. హిందీ రీమేక్ లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. సైకో ఫ్లాష్ బ్యాక్ ని కట్ షార్ట్ చేసి, లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఇంకోలా మార్చేశారు. ఇవి తేడా కొట్టాయి. స్కూల్ మాస్టర్ ఎపిసోడ్ ని కూడా కొంత ఖంగాళీ చేశారు. కీలకమైన క్లైమాక్స్ ని ఫాస్ట్ గా నడిపించాలనే ఉద్దేశంతో హడావిడి పడ్డారు. అన్నిటిని మించి తమిళ తెలుగులో ప్రాణంగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్ పుత్లీలో మైనస్ అయ్యింది. సైరా ఫేమ్ జూలియస్ పకియం ఆకట్టుకునే బీజీఎమ్ ఇవ్వలేదు
ఇలా అన్నిరకాలగా కట్ పుత్లీకి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. అక్షయ్ కుమార్ కి ఇది నాలుగో షాక్. థియేటర్ బాక్సాఫీస్ వద్ద వరసగా బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్ మూడు వరసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ ని అందించాయి. ఇప్పుడు నాలుగోది కూడా అదే బ్యాచ్ లో చేరడం విషాదం. ఎప్పుడూ ఒరిజినల్ సోల్ ని మార్చకూడదనే సూత్రాన్ని పక్కనపెట్టి దర్శకుడు రంజిత్ ఎం తివారి స్వంత ప్రయోగం చేయడంతో దానికి తగ్గట్టే ఫలితం కూడా తేడా కొట్టేసింది. లెన్త్ తగ్గించినా ఫలితం లేకపోవడం విచారకరం. సరిగా కట్ పుత్లీ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో చేసిన రోజే జీ5 ఉద్దేశపూర్వకంగా రాక్షసుడు హిందీ డబ్బింగ్ వెర్షన్ ని తన యాప్ లో రిలీజ్ చేయడం మరో ట్విస్ట్.