Akkineni Naga Chaitanya : అక్కినేని హీరోకు మంచి ఛాలెంజే

గత ఏడాది విడుదలైన తమిళంలో మంచి విజయం సాధించిన మానాడు రీమేక్ తాలూకు పనులు మొదలైనట్టుగా ఫిలిం నగర్ టాక్. హక్కులు సొంతం చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వీలైనంత త్వరగా స్క్రిప్ట్ ని పూర్తి చేయించి ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన వెంకట్ ప్రభుతోనే డైరెక్షన్ చేయించేలా అంతా సెట్ చేసుకుందని సమాచారం. నాగ చైతన్య రానా ఇద్దరిలో ఒకరితో ఇది సెట్ చేయాలనుకుని ఫైనల్ గా చైతుకే ఓటు వేశారని అంటున్నారు. ఆ మేరకు నాగచైతన్య కూడా ప్రాధమికంగా అంగీకారం తెలిపాడట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. హిరోయిన్ ఎవరు కాంబినేషన్ల గురించి అప్పుడే ఒక కంక్లూజన్ కు రాలేం కాబట్టి వేచి చూడాలి.

మరి ఇక్కడ రిస్కీ రీమేక్ అనడానికి కారణం ఉంది. మానాడు టైం లూప్ లో సాగే ఒక డిఫరెంట్ థ్రిల్లర్. పైగా హీరో పాత్ర ముస్లిం. ఈ క్యాటగిరీలో సౌత్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఒక్క బాషా మాత్రమే ల్యాండ్ మార్క్ గా మిగిలిపోయింది. అందులో కూడా రజనీకాంత్ తన స్నేహితుడి పేరుని పెట్టుకుంటాడు. అసలు నేమ్ మాణిక్యం అనే ఉంటుంది. సరే ఇదేమంత పెద్ద విషయం కాదనుకుంటే పదే పదే రిపీట్ అనిపించే టైం లూప్ స్క్రీన్ ప్లేతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించడం అంత ఈజీ కాదు. పైగా ఇది కమర్షియల్ అంశాలకు భిన్నంగా సాగుతుంది కాబట్టి ఏ మేరకు అభిమానులు రిసీవ్ చేసుకుంటారు అనేది వేచి చూడాలి.

ప్రస్తుతానికి చైతు దీని గురించి ఏమి మాట్లాడ్డం లేదు. జనవరిలో బంగార్రాజుతో హిట్టు కొట్టాక థాంక్ యు విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఏప్రిల్ దాకా బాక్సాఫీస్ కంప్లీట్ గా ప్యాక్ అయిపోవడంతో నిర్మాత దిల్ రాజు తొందరపడటం లేదు. థాంక్ యు దర్శకుడు విక్రమ్ కుమార్ తోనే చేసిన వెబ్ సిరీస్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని వెయిటింగ్ లో ఉందట. ఏప్రిల్ లో అమీర్ ఖాన్ తో కలిసి నాగచైతన్యని లాల్ సింగ్ చద్దాలో చూద్దామని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ కలిగిస్తూ అది ఆగస్ట్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొత్తానికి మానాడు టాపిక్ అయితే ఫ్యాన్స్ లో జోరుగా ఉంది

Also Read : Aadavaallu Meeku Johaarlu : పద్మవ్యూహంలో శర్వా సినిమా

Show comments