iDreamPost
android-app
ios-app

ఎంగేజ్మెంట్ తర్వాత నాగ చైతన్య ఫస్ట్ ఇంటరాక్షన్.. శోభితాతో మూవీపై క్లారిటీ..

  • Published Aug 27, 2024 | 10:05 PM Updated Updated Aug 27, 2024 | 10:05 PM

Naga Chaitanya Clarity On Movie With Shobitha: యువ సామ్రాట్ నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ ఇంటరాక్షన్ లో శోభితాతో సినిమా అనే అశంపై క్లారిటీ ఇచ్చేశాడు.

Naga Chaitanya Clarity On Movie With Shobitha: యువ సామ్రాట్ నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ ఇంటరాక్షన్ లో శోభితాతో సినిమా అనే అశంపై క్లారిటీ ఇచ్చేశాడు.

  • Published Aug 27, 2024 | 10:05 PMUpdated Aug 27, 2024 | 10:05 PM
ఎంగేజ్మెంట్ తర్వాత నాగ చైతన్య ఫస్ట్ ఇంటరాక్షన్.. శోభితాతో మూవీపై క్లారిటీ..

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యకు.. స్టార్ హీరోయిన్ శోభితా ధూలిపాళ్లకు ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ స్టార్స్ మరికొన్ని రోజుల్లో స్టార్ కపుల్ గా మారబోతున్నారు. శోభితా అక్కినేని కోడలు కాబోతోంది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత హీరో- హీరోయిన్ ఇద్దరూ పెద్దగా మీడియాకి, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో దొరకలేదు. పెద్దగా స్పందించలేదు కూడా. కానీ, తాజాగా నాగ చైతన్య ఐడ్రీమ్ మీడియాతో ఎక్స్ క్లూజివ్ గా ముచ్చటించాడు. ఆ స్మాల్ ఇంటరాక్షన్ లో చాలానే విషయాలను నాగ చైతన్య అయితే పంచుకున్నాడు. వాటిలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అన్నింటికంటే శోభితాతో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు అనే విషయంపై నాగ చైతన్య రియాక్ట్ అయ్యాడు.

ఒక స్టోర్ ని ప్రారంభించే కార్యక్రమంలో నాగ చైతన్య పాల్గొన్నాడు. బరాత్ పెట్టి ఒక పెల్లి ఊరేగింపులా తీసుకెళ్లిన విధానం అందరికీ తెగ నచ్చేస్తోంది. ఈ వీడియోలో నాగ చైతన్యను చూస్తే అతని పెళ్లి బరాత్ అనుకుంటారు. ఆ తర్వాత ఐడ్రీమ్ ప్రతినిధితో నాగ చైతన్య మాట్లాడాడు. పెళ్లికి కూడా ఇలాంటి డ్రెస్ లోనే, ఇలాంటి కలర్ లోనే కనిపిస్తారా? అంటే ఇంకా అంతదూరం ఆలోచించలేదు అన్నాడు. అయితే అదే తన ఫేవరెట్ కలర్ అని మాత్రం క్లారిటీ ఇచ్చాడు. వైట్, క్రీమ్ వంటి సెటిల్ కలర్స్ అంటే ఇష్టమని చెప్పాడు. ఇంక బాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా నాగ చైతన్య రియాక్ట్ అయ్యాడు. ఏమైనా బాలీవుడ్ సినిమాలు ఓకే చేశారా అని అడగ్గా.. స్క్రిప్ట్స్ అయితే ఎక్కడి నుంచైనా వింటాను. ఎవరు వచ్చినా కథలు వింటాను అని చై క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఎలాంటి బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు.

ఇంక శోభితాతో సినిమా చేసే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు చేస్తారు? అనే ప్రశ్నకు నాగ చైతన్య పిచ్చ క్లారిటీ ఇచ్చాడు. శోభితాతో సినిమా చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాననే చెప్పాడు. అలాగే స్ట్క్రిప్ట్స్ వింటున్నట్లు కూడా చెప్పాడు. ప్రస్తుతం తాను కేవలం తండేల్ మాత్రమే చేస్తున్నానని చై చెప్పుకొచ్చాడు. తండేల్ సినిమా ఈ ఏడాది చివరికి విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇంక నాగ చైతన్య- శోభితా ధూలిపాళ్ల వివాహం ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించగా.. నాగ చైతన్య అతి త్వరలోనే మీకు తెలియజేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అంటే త్వరలోనే చై- శోభితా పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom