iDreamPost
android-app
ios-app

కొత్త కారు కొన్న హీరో నాగ చైతన్య.. ధర అన్ని కోట్లా?

  • Published May 29, 2024 | 1:41 PM Updated Updated May 29, 2024 | 1:41 PM

Naga Chaitanya- Porsche 911 GT3 Price: యువసామ్రాట్ నాగ చైతన్యకు కార్లు అంటే ఎంత ఇష్టమే చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు నాగ చైతన్య గరాజ్ లోకి కొత్త స్పోర్ట్స్ కారు వచ్చేసింది. దాని ధర వింటే మైండ్ గిర్రున తిరుగుతుంది.

Naga Chaitanya- Porsche 911 GT3 Price: యువసామ్రాట్ నాగ చైతన్యకు కార్లు అంటే ఎంత ఇష్టమే చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు నాగ చైతన్య గరాజ్ లోకి కొత్త స్పోర్ట్స్ కారు వచ్చేసింది. దాని ధర వింటే మైండ్ గిర్రున తిరుగుతుంది.

  • Published May 29, 2024 | 1:41 PMUpdated May 29, 2024 | 1:41 PM
కొత్త కారు కొన్న హీరో నాగ చైతన్య.. ధర అన్ని కోట్లా?

యువ సామ్రాట్ నాగ చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు అయితే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తండ్రి చరిష్మాతో కాకుండా.. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. అయితే నాగ చైతన్య గురించి చాలా మందికి సినిమాల వరకే తెలుసు. కానీ, నాగ చైతన్యకు కార్లు అంటే ఎంత ఇష్టమో చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే నాగ చైతన్య ఒక రేసర్ అని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు నాగ చైతన్య గరాజ్ లోకి ఒక కొత్త పోర్షా కారు వచ్చింది. ప్రస్తుతం నెట్టింట ఈ కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఆ కారు స్పెషాలిటీస్ గురించి అందరు తెగ చర్చించుకుంటున్నారు.

గత నాలుగు రోజులగా నెట్టింట ఎక్కడ చూసినా నాగ చైతన్య గురించి పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే చై గరాజ్ లోకి ఒక కొత్త పోర్షా కారు వచ్చింది. సాధారణంగానే పోర్షా అంటే కోట్లలో ఉంటుంది. మరి.. కొత్త కారు ధర ఎంత? దాని స్పెషాలిటీలు ఏంటి అని అంతా తెగ వెతికేస్తున్నారు. నాగ చైతన్య తీసుకున్న కొత్త కారు పోర్షా కంపెనీకి చెందిన 911 జీటీ3 మోడల్. ఈ కార్లు ఇండియాలో కాస్త లిమిటెడ్ గానే ఉంటాయి. అంతేకాకుండా నాగ చైతన్య ఈ పోర్షా కంపెనీకి పెద్ద అభిమాని కూడా. అసలు ఎందుకు పోర్షా కొంటారు అనే దానికి తన మనసులో ఉన్న మాటను కూడా చెప్పేశాడు.

Nagachaitanya new car

పోర్షా కంపెనీ ఇలాంటి కార్స్ తయారు చేయడానికి పెట్టింది పేరు. ట్రాక్ లో స్పీడింగ్ చేసే సమయంలో, వేగంగా కారును నడపాలి అనుకున్నప్పుడు పోర్షా కార్లు మనల్ని డిసప్పాయింట్ చేయవంటూ చై చెప్పుకొచ్చాడు. ఇంక ఈ కొత్త పోర్షా 911 జీటీ3 విషయానికి వస్తే.. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర ఏకంగా రూ.3.5 కోట్ల వరకు ఉంటుంది. మీరు ఈ కారులో కోరుకునే సౌకర్యాలు, స్పోర్టీ ఫీచర్స్ ని బట్టి దాని ధర మారుతూ ఉంటుంది. ఈ కారు వెనుక ఉండే స్పాయిలర్ ధరే ఏకంగా రూ.2 లక్షల వరకు ఉంటుందంట. అంతేకాకుండా మీరు మీకు కావాల్సిన అన్ని అదనపు ఫీచర్స్, యాడాన్స్ గనుక పోర్షా ఇన్ స్టాల్ చేయించుకుంటే వాటి ధరే రూ.2 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు.

ఈ పోర్షా 911 జీటీ3 కారు కేవలం 3 సెకన్ల కంటే తక్కువ సమయంలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇంక లుక్స్ పరంగా పోర్షాని కొట్టే స్పోర్ట్స్ కారు ఉండదు అంటూ కార్ లవర్స్ కామెంట్స్ చేస్తుంటారు. నాగచైతన్య రీసెంట్ గా ఈ కారులో తిరుగుతున్న వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అయ్యిందే. అలాగే కారును రిసీవ్ చేసుకుంటున్న సమయంలో దిగిన ఫొటోలు, ఈ పోర్షాతో ఉన్న సిట్ల్స్ కూడా నెట్టిట చక్కర్లు కొడుతున్నాయి. మరి.. నాగ చైతన్య తీసుకున్న ఈ పోర్షా 911 జీటీ3 కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş