iDreamPost
android-app
ios-app

నిశ్చితార్థం అయిపోయింది.. ఫొటోలు షేర్‌ చేసిన నాగార్జున

  • Published Aug 08, 2024 | 1:25 PM Updated Updated Aug 08, 2024 | 2:11 PM

Naga Chaitanya- Sobhita Dhulipala Engagement: అక్కినేని నట వారసుడు, నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం నటి శోభితా దూళిపాళ గురువారం జరిగింది. ఈ ఫోటోలను షేర్ చేశారు అక్కినేని నాగార్జున.

Naga Chaitanya- Sobhita Dhulipala Engagement: అక్కినేని నట వారసుడు, నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం నటి శోభితా దూళిపాళ గురువారం జరిగింది. ఈ ఫోటోలను షేర్ చేశారు అక్కినేని నాగార్జున.

  • Published Aug 08, 2024 | 1:25 PMUpdated Aug 08, 2024 | 2:11 PM
నిశ్చితార్థం అయిపోయింది.. ఫొటోలు షేర్‌ చేసిన నాగార్జున

అక్కినేని నాగ చైతన్య- నటి శోభిత దూళిపాళ ఎంగేజ్ మెంట్ ఈ రోజు జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఉదయం 9.42 నిమిషాలకు వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరిగింది. కాగా, నాగ చైతన్యకు ఇది రెండో వివాహం. గతంలో టాలీవుడ్ స్టార్ నటి సమంతను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి విదితమే. సమంత- నాగ చైతన్య 2017లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ ఏడాది అక్టోబర్ 6-7 తేదీల్లో హిందూ, క్రిస్టీయన్ వివాహ పద్దతుల్లో వివాహం చేసుకున్నారు. అయితే 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఆ తర్వాత చైతూ.. శోభితతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కొన్ని ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి. కానీ ఈ ఇద్దరు వీరి రిలేషన్ గురించి ఎక్కడా అఫీషియల్ ఎనౌన్స్ చేయలేదు.

తాజాగా ఈ ఇద్దరు గురువారం ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. నాగార్జున అఫీషియల్ ట్వీట్ చేయడంతో న్యూస్ నిజమైంది.  ‘మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం,  శోభిత ధూళిపాళతో ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెను మా కుటుంబంలోకి చాలా సంతోషంగా స్వాగతిస్తున్నాం. ఈ ఇద్దరికీ అభినందనలు, వారికి జీవితాంత ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను’  అంటూ ఫోటోలను ట్వీట్ చేశారు నాగార్జున.  నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నాడు.  ఈ ఏడాది డిసెంబర్ బరిలో దిగనుంది ఈ మూవీ.

నాగ చైతన్య కాబోయే శ్రీమతి శోభితా దూళిపాళ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జన్మించింది. నాన్న మర్చంట్ నావీలో ఉద్యోగం చేయడంతో ఫ్యామిలీ విశాఖ పట్నానికి షిఫ్ట్ అయ్యింది. ఆమె విశాఖ పట్నంలో పెరిగింది. ఆ తర్వాత ముంబయిలో హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది.  అలా మోడల్ గా మారి, మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. రామ్ రాఘవన్ 2.0 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలను చేసింది. తాజాగా మంకీ మాన్ అనే అమెరికన్ మూవీతో పలకరించింది బ్యూటీ. ప్రస్తుతం సితార అనే హిందీ మూవీలో నటిస్తుంది. ఆమె మేడిన్ ఇన్ హెవెన్, బర్డ్ ఆఫ్ బ్లడ్, ద నైట్ మేనేజర్ వంటి ఓటీటీ సిరీస్ చేసింది. వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet