iDreamPost
android-app
ios-app

Akhanda : రెండు చోట్లా బాలయ్య బ్లాక్ బస్టర్

  • Published Jan 23, 2022 | 5:05 AM Updated Updated Jan 23, 2022 | 5:05 AM
Akhanda : రెండు చోట్లా బాలయ్య బ్లాక్ బస్టర్

బాలకృష్ణ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ వెండితెర మీదే కాదు ఓటిటిలోనూ రచ్చ చేస్తోంది. థియేటర్లో విడుదలైన యాభై రోజుల తర్వాత డిజిటల్ లోకి వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ డిస్నీ హాట్ స్టార్ లో కనివిని ఎరుగని స్థాయిలో రికార్డులు సృష్టిస్తోందని సమాచారం. ఇరవై నాలుగు గంటల లోపు హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న మూవీగా మాములు సంచలనం రేపడం లేదు. కొద్దిగంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయని, ఇది హాట్ స్టార్ లోనే కాదు మొత్తంగా ఆఫ్టర్ థియేటర్ ఓటిటి సినిమాల్లోనే గొప్ప రికార్డని సదరు సంస్థ పేర్కొంటోంది. యుట్యూబ్ తరహాలో కౌంట్ చెప్పడం లేదు కానీ ఈ ట్రెండ్ చూస్తూ బాలయ్య అభిమానులు ఆనందం మాములుగా లేదు.

సోషల్ మీడియాలోనూ సెలబ్రిటీలు అఖండ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఇదే రోజు నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన నాని శ్యామ్ సింగ్ రాయ్ కి ఈ స్థాయిలో స్పందన రావడం లేదు. ప్రభుదేవా లాంటి ఒకరిద్దరు ప్రముఖులు మెచ్చుకున్నారు కానీ అంతకు మించి ఎలాంటి ప్రమోషన్ కనిపించడం లేదు. ఇక తమన్ గురించి చెప్పాల్సిన పని లేదు. అఖండ పైరసీ వెర్షన్లు డౌన్లోడ్ చేసుకున్న కొందరు అందులో సీన్లు కట్ చేసి వీడియోలు పెట్టడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని హై లైట్ చేస్తూ సీన్లను షేర్ చేయడం ఇలా హంగామా మాములుగా లేదు. తమన్ కూడా వాటిలో అధిక శాతం రీ ట్వీట్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు.

ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమయ్యింది. నిజమైన బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఏ సినిమాకైనా తక్కువ గ్యాప్ ఓటిటి అక్కర్లేదు. యాభై రోజుల తర్వాత వచ్చినా కూడా జనం బ్రహ్మాండంగా ఆదరిస్తారు. పుష్ప ఈ విషయంలోనే పొరపాటు చేసింది, కేవలం ఇరవై రోజుల నిడివితో ప్రైమ్ కి ఇవ్వడం నార్త్ లో కలెక్షన్లను బాగా ప్రభావితం చేసింది. కానీ అఖండకు అలా చేయకపోవడం వల్ల ప్రతి వీకెండ్ లోనూ చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇవాళ 52వ రోజు హైదరాబాద్ లో యాభైకి పైగా షోలు వేయడం చూస్తే ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బంగార్రాజు మినహాయించి సంక్రాంతి చప్పగా ఉండటం అఖండకు మళ్ళీ కలిసి వస్తోంది

Also Read : Ala Vaikunthapurramloo : థియేటర్లో ఆపారు సరే మరి ఛానల్ లో వస్తోందే

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler