iDreamPost
android-app
ios-app

హిందీ డబ్బింగ్ – మళ్ళీ రీమేక్

  • Published Jul 12, 2021 | 6:33 AM Updated Updated Jul 12, 2021 | 6:33 AM
  • Published Jul 12, 2021 | 6:33 AMUpdated Jul 12, 2021 | 6:33 AM
హిందీ డబ్బింగ్ – మళ్ళీ రీమేక్

గత ఏడాది ఓటిటిలో రిలీజైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఆకాశం నీ హద్దురా(తమిళం సూరారై పోట్రు)ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలతో పాటు అమెజాన్ ప్రైమ్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న ఈ సినిమాకు ఆ మధ్యే హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా అదే యాప్ లో తీసుకొచ్చారు. కానీ ఈలోగా ఈ ప్రకటన రావడం విశేషం. అయితే ఇప్పుడీ రీమేక్ లోనూ సూర్యనే హీరోగా నటిస్తాడా లేక వేరే స్టార్ ని ఎంపిక చేసుకుంటారా అనే క్లారిటీ మాత్రం లేదు. నిర్మాతగా తనతో పాటు భార్య జ్యోతిక పేరు మీద 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద దీన్ని నిర్మించబోతున్నారు. దర్శకురాలు సుధా కొంగరనే ఉండబోతున్నారు.

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే హిందీలో సూర్య బదులు వేరే హీరో నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆకాశం నీ హద్దురా రిలీజైన టైంలో, హిందీ డబ్ చేసి వదిలిన సమయంలో నార్త్ ఆడియన్స్ దీన్ని అధిక సంఖ్యలో చూశారు. మళ్ళీ సూర్యతోనే అంటే జస్ట్ రిపీట్ చేసినట్టుగా ఉంటుందే తప్ప కొత్తగా ఫీలవ్వడానికి ఏముండదు. అదే బాగా పరిచయమున్న బాలీవుడ్ స్టార్ అయితే చేంజ్ తో పాటు సౌత్ ఆడియన్స్ మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అది తేలనందుకే హీరో అనౌన్స్ మెంట్ పెండింగ్ లో ఉంచినట్టు సమాచారం. ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాధ్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే

ఇటీవలి కాలంలో సౌత్ సినిమాల రీమేకులు జోరుగానే సాగుతున్నాయి. అప్పుడెప్పుడో ఐదేళ్ల క్రితం వచ్చిన విక్రమ్ వేదాని నిన్న అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆకాశం నీ హద్దురా వంతు వచ్చింది. టెక్నాలజీ వల్ల వరల్డ్ సినిమా అందరికీ చాలా సులభంగా చేరువవుతున్న తరుణంలో ఇలాంటి రీమేకులు గట్రా వీలైనంత వేగంగా చేయడం మంచిది. ఆలస్యం చేస్తే ప్రేక్షకులు ఉండబట్టలేక ఒరిజినల్ వెర్షన్లను ఓటిటి లో చూసేస్తున్నారు. సబ్ టైటిల్స్ లాంటి సౌకర్యం ఎలాగూ ఉండనే ఉంది. ఆకాశం నీ హద్దురా ఉత్తరాది ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom