iDreamPost
android-app
ios-app

హైకోర్టు సీజేగా జస్టిస్ గోస్వామి – గెజిట్ నోటిఫికేషన్ విడుదల

  • Published Jan 01, 2021 | 9:14 AM Updated Updated Jan 01, 2021 | 9:14 AM
హైకోర్టు సీజేగా జస్టిస్ గోస్వామి – గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియమితులయ్యారు. అయన నియామకానికి రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ఆమొద ముద్ర వేశారు. దీనికి సంభందించిన గజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర న్యాయ శాఖ విడుదల చేసింది. ఏపీ సీజే గా నియమితులైన జస్టిస్‌ గోస్వామి అసోంలోని జోర్హాట్‌లో 1961 మార్చి 11న జన్మించారు. అసోం రాష్ట్రంలో గువాహటి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఆ తరువాత అదే ఏడు ఆగస్టు 16న న్యాయవాదిగా నమోదయ్యారు.

న్యాయవాద కెరీర్ లో విభిన్న కేసులను వాదించిన అరూప్‌ గోస్వామి 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా పొందారు. 2011లో గువాహటి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆతరువాత పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2019 అక్టోబరు 15న బాధ్యతలు చేపట్టారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్‌ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు.