iDreamPost
android-app
ios-app

T.congress – తెలంగాణ కాంగ్రెస్ కు హుజురాబాద్ తలనొప్పి..!

T.congress – తెలంగాణ కాంగ్రెస్ కు హుజురాబాద్ తలనొప్పి..!

తెలంగాణా కాంగ్రెస్ లో ఇప్పుడు హుజూరాబాద్ ఓటమి పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి సంబంధించి చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బిజెపికి వెళ్లడాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ మాత్రం జీర్ణించుకోవడం లేదు. ఇక దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం సమీక్ష చేస్తుంది. ఇప్పటికే పార్టీ నేతలతో పార్టీ అగ్ర నేత కేసి వేణుగోపాల్ పలు మార్లు మాట్లాడారు. సీనియర్ నాయకుల మధ్య ఉన్న విభేదాలు పార్టీని పూర్తిగా నాశనం చేశాయనే వ్యాఖ్యలు వినిపించాయి.

ఇక హుజురాబాద్ ఓటమిపై ఏఐసిసి సమీక్ష నిర్వహించింది. ఓటమికి మీదంటే, మీదే బాధ్యత అని పరస్పరం టిపిసిసి నేతలు ఆరోపణలు చేసుకున్నారు అని సమాచారం. హుజురాబాద్ మీదే కాకుండా నాగార్జునసాగర్, హుజూర్ నగర్, దుబ్బాక ఓటమి పై సమీక్ష నిర్వహించాలని మాజీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీలో ఉండి కొందరు టిఆర్ఎస్ కు సహకరిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని వ్యాఖ్యలు చేేశారు.

ఈటెలను పార్టీ లో చేర్చుకుని ఉంటే బావుండేదని కేసి వేణుగోపాల్ వద్ద సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తావించారు. కొంతమంది… ఈటెల రాకుండా అడ్డుకున్నారని వ్యాఖ్యానించిన భట్టి.. కామెంట్ పై కేసి  వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈటెలను పార్టీలోకి తీసుకోవద్దని నువ్వే చెప్పి.. ఇప్పుడు ఇతరుల మీద నిందలు ఎందుకు వేస్తున్నావు అని కేసి ఫైర్ అయినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి కొందరు టిఆర్ఎస్ కు సహకరిస్తున్నారని కేసి ముందే పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది.దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసి చూడండని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని పార్టీ నేతలు కాస్త ఆసక్తిగా చూస్తున్నారు. అయితే పార్టీలో త్వరలో తాను ప్రక్షాళన మొదలు పెడతాను అని కేసి వేణుగోపాల్ చెప్పారు అని సమాచారం. పార్టీలో కొందరు నేతలను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందనే కామెంట్ కూడా ఆయన కొందరిని ఉద్దేశించి చేేశారు అని తెలుస్తోంది.యువ నాయకులను సీనియర్ నాయకులు పైకి రానీయడం లేదనే కామెంట్ కూడా కొందరి నాయకుల నుంచి వచ్చినట్టు తెలుస్తుంది.

Also Read :  Telangana BJP By Polls -తెలంగాణ బీజేపీ కి క‌లిసొచ్చిన ఉప ఎన్నిక‌లు