iDreamPost
android-app
ios-app

Agraham : యాంగ్రీ మ్యాన్ సంధించిన పవర్ ఫుల్ బుల్లెట్ – Nostalgia

  • Published Nov 13, 2021 | 11:50 AM Updated Updated Nov 13, 2021 | 11:50 AM
Agraham : యాంగ్రీ మ్యాన్ సంధించిన పవర్ ఫుల్ బుల్లెట్ – Nostalgia

1989లో అంకుశం రూపంలో దక్కిన బ్లాక్ బస్టర్ రాజశేఖర్ కు ఒక్క దెబ్బకు యాంగ్రీ మ్యాన్ ఇమేజ్ తీసుకొచ్చి మాస్ ఫాలోయింగ్ ని అమాంతం పెంచేసింది. అప్పటికే చిరంజీవి బాలకృష్ణ లాంటి కమర్షియల్ హీరోయిజంకు అలవాటైన ప్రేక్షకులకు ఈయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ ని పలికే తీరు బాగా నచ్చాయి. అంతే అప్పటి నుంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలే ఎక్కువ ఆశించేవారు. కానీ రాజశేఖర్ దానికే కట్టుబడకుండా అన్ని రకాల సబ్జెక్టులు చేసేవారు కానీ ప్రతిసారి అంచనాలు ఎక్కువైపోయి ఆశించిన ఫలితాలు దక్కేవి కాదు. మూడేళ్ళ కాలంలో చెప్పుకోదగ్గ హిట్లు మగాడు, అక్క మొగుడు, బలరామకృష్ణులు మాత్రమే. అభిమానులు సైతం అంకుశం రేంజ్ బొమ్మ కావాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాలు కూడా రాసేవారు.

ఆ సమయంలో మరోసారి రాజశేఖర్ ను పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించాలనే ఉద్దేశంతో మణిరత్నం దగ్గర పనిచేసి డైరెక్షన్ డెబ్యూ కోసం ప్రయత్నిస్తున్న కెఎస్ రవి సిద్ధం చేసిన కథ ఎంఎస్ రెడ్డి, ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డిగా బాగా నచ్చింది. కానీ కోడిరామకృష్ణతో కాకుండా బయట దర్శకుడితో చేయడం మార్కెట్ పరంగా రిస్క్ అనుకున్నారు. అయితే రవిలోని క్రియేటర్ ఆ ఆలోచనను వాళ్లలో ఉండనివ్వలేదు. అంతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అప్పటికే సినిమాలు తగ్గించేసిన ఆమల హీరోయిన్ గా చేసేందుకు ఒప్పుకుంది. ముఖ్యమంత్రిగా పదిరే కృష్ణారెడ్డి విభిన్నమైన యాసతో విశ్వరూపం చూపించారు. ఇందులో నోటెడ్ ఆర్టిస్టులు తక్కువగా ఉంటారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించగా రాజ్ కోటి సంగీతం, సి విజయ్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.

మిలిటరీ నుంచి వచ్చిన ఓ ఆఫీసర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తున్న దుర్మార్గాలకు అడ్డు పడతాడు. తన ప్రమేయం లేకపోయినా ఓ హత్యకు సాక్షిగా ఉన్నందుకు సిఎం చేసిన కుట్రలకు బాధితుడిగా మారి చివరికి పిచ్చివాడిగా ముద్ర వేయించుకుంటాడు. తర్వాత బయటికి వచ్చి అతను ఏం చేశాడన్నదే మిగిలిన కథ. ఒకరకంగా చెప్పాలంటే మెయిన్ పాయింట్ కొంత బొబ్బిలిపులితో సింక్ అయినప్పటికీ కెఎస్ రవి గురువు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ స్టైల్ అఫ్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు. మార్కెట్ వేల్యూ కోసం పాటలను ఇరికించినప్పటికీ ఫైనల్ గా ఒక ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ డ్రామాని ప్రెజెంట్ చేయగలిగారు. దీనికి గాను జాతీయ సమైక్య విభాగం కింద నంది అవార్డు కూడా దక్కింది. 1993లో విడుదలైన ఆగ్రహం కమర్షియల్ గా అద్భుతాలు చేయకపోయినా రాజశేఖర్ లోని గొప్ప నటుడిని మరోసారి ప్రపంచానికి చూపించింది. ఈ దర్శకుడు కెఎస్ రవి తర్వాత తమిళంలో మరో మూడు సినిమాలు చేశారు కానీ ఎక్కువ విజయాలు దక్కక కెరీర్ కి త్వరగానే స్వస్తి చెప్పారు.

Also Read : Eshwar : డార్లింగ్ ప్రభాస్ ‘ఈశ్వర’ మాయ – Nostalgia