iDreamPost
android-app
ios-app

KGF నిర్మాతలతో అఖిల్ సినిమా

  • Published Jan 18, 2023 | 10:34 PM Updated Updated Dec 05, 2023 | 6:18 PM

హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ లో త్వరలో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్.

హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ లో త్వరలో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్.

  • Published Jan 18, 2023 | 10:34 PMUpdated Dec 05, 2023 | 6:18 PM
KGF నిర్మాతలతో అఖిల్ సినిమా

ఇంకా ఏజెంట్ పూర్తి కాకుండా అఖిల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ కి వెళ్ళిపోతున్నాడు. హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ లో త్వరలో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు సమాచారం. కెజిఎఫ్ తో పన్నెండు వందల కోట్ల ఇండస్ట్రీ హిట్ ని కాంతార రూపంలో అయిదు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న హోంబాలే సంస్థ రాబోయే కొన్నేళ్లలో మూడు వేల కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ భాషల్లో ఆరుకి పైగా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా అఖిల్ ది కూడా తోడైతే లైనప్ చాలా క్రేజీగా మారిపోతుంది

అఫీషియల్ అయ్యేదాకా వేచి చూడాలి కానీ అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి భారీ ఎత్తున క్లైమాక్స్ ని చిత్రీకరిస్తున్నారు. దీంతో గుమ్మడికాయ కొట్టేస్తారు. చివరి ఘట్టానికి రెండు వెర్షన్లు షూట్ చేస్తున్నారని తర్వాత వీటిలో ఒకటి ఫైనల్ చేస్తారని టాక్. ఏప్రిల్ లో విడుదలకు నిర్మాత అనిల్ సుంకర ప్లాన్ చేస్తున్నారు. అదెంత వరకు సాధ్యమవుతుందో చెప్పలేం. ఎందుకంటే ఇదే బ్యానర్ లో రూపొందుతున్న చిరంజీవి భోళా శంకర్ ని అదే నెల 14కి గతంలోనే ప్రకటించారు. ఒకవేళ ఏజెంట్ కి ఆ డేట్ కావాలనుకుంటే మెగా మూవీని వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదు

మొత్తానికి అఖిల్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నాడు కానీ దానికి తగ్గ వేగం చూపించడం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటిదాకా చేసింది నాలుగు సినిమాలే. వాటిలో ఒకటే కమర్షియల్ లెక్కల్లో సేఫ్ అయ్యింది కానీ మిగిలినవి ఫ్లాపే. అందుకే మాస్ కి దగ్గర చేసేలా ఏజెంట్ లో అన్ని అంశాలు దట్టించారు. అంతా బాగానే ఉంది కానీ మరీ ఇంత నెమ్మది అయితే ఎలానేదే ఫ్యాన్స్ ప్రశ్న. అన్నయ్య నాగ చైతన్య కస్టడీ షూట్ లో బిజీగా ఉండగా నాగార్జున బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇవి రెండు ఈ ఏడాదే వస్తాయి. ఏజెంట్ తో కలిపి మొత్తం మూడు ఫ్యాన్స్ కి కనువిందు చేయనున్నాయి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom