iDreamPost
iDreamPost
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాతో మళ్లీ తెరపైకి రానున్నాడు. SS రాజమౌళి, చిరంజీవి, మరికొంత మంది సౌత్ సినిమా పెద్దల కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేశాడు. ఇప్పుడు ఇండియాలోనే అత్యుత్తర స్టోరీ టెల్లర్ రాజమౌళియే. పెద్ద సినిమాల్లో యాక్షన్, ఎమోషన్ బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళిది హాలీవుడ్ స్థాయి. అందుకే రాజమౌళి సలహాను అమీర్ ఖాన్ కోరాడు.
అమీర్ ఖాన్ భారీ సినిమా లాల్ సింగ్ చద్దా. టామ్ హాంక్స్ చిత్రం ఫారెస్ట్ గంప్‌కి అఫిషియల్ రిమేక్. అక్కడ మోడర్న్ అమెరికా స్టోరీని టామ్ హాంక్స్ చెబితే, ఇక్కడ ఇండియాలో కీలక రాజకీయ ఘటనలన్నింటిని సాక్ష్యం చెప్పబోతున్నాడు లాల్ సింగ్ చద్దా. ఇదో ఒక వ్యక్తి జర్నీ మాత్రమేకాదు, ఇండియన్ హిస్టరికల్ జర్నీకూడా. ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ చివరకు ఆగస్ట్ నెలలో థియేటర్లలోకి రానుంది. అయితే వెండితెర మీద ఈ సినిమాను చూడకముందే, ఈ పాన్-ఇండియా చిత్రాన్ని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రముఖులు, SS రాజమౌళి వంటి స్టార్లు చూసేశారు.
చిరంజీవి, ఎస్‌ఎస్ రాజమౌళి, నాగ చైతన్య, సుకుమార్, మరికొంత మంది అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా చూస్తున్న పిక్ వైరల్ అయ్యింది. లాల్ సింగ్ చద్దా స్పెషల్ స్క్రీనింగ్‌కు, యాక్టర్ నాగ చైతన్య , నాగార్జున కూడా హాజరయ్యారు. నాగ చైతన్య ఈ అమీర్ ఖాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాని స్టార్స్ మూవీని ఎంజాయ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో సన్సేషన్ అయ్యింది. SS రాజమౌళి అమీర్ ఖాన్ కోసం ఏదైనా ప్రత్యేక సలహాలు ఏమైనా ఇచ్చారా?
బాలీవుడ్ , సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య లైన్లు చెరిగిపోయాయి. బాలీవుడ్ , సౌత్‌లో ఒకరి సినిమాలో మరొకరు నటిస్తున్నారు. డైరెక్టర్లు కూడా ఒకరి సాయం మరొకరు తీసుకొంటున్నారు. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అయాన్ ముఖర్జీ , రణబీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర కోసం RRR మరియు బాహుబలి చిత్రనిర్మాత SS రాజమౌళి తండ్రి నుండి సలహాలు తీసుకున్నారు. కెవి విజయేంద్ర ప్రసాద్ సలహాతో, అయాన్ ముఖర్జీ మొత్తం సన్నివేశాన్ని తిరిగి చిత్రీకరించాడని రణబీర్ మీడియాకు చెప్పాడు. నిజానికి బ్రహ్మాస్త్ర లాంటి సినిమాకు విజయేంద్రప్రసాద్ లాంటి రైటర్ సలహాలు చాలా ఉపయోగం. ఇప్పుడు ఇండియాలో ఫాంటసీ సినిమాల సృష్టికర్తలు ఇద్దరే. ఒకరు విజయేంద్రప్రసాద్, రెండోది రాజమౌళి.