iDreamPost
iDreamPost
కొద్దిరోజుల క్రితం శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందబోయే మహా సముద్రంని ఏకే ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో హీరొయిన్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చెలియా, పద్మావత్, సమ్మోహనం, వి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువైన ఆదితి రావు హైదరిని లాక్ చేసుకున్నారు. దీని తాలుకు వార్త వారాల కిందటే లీకైనప్పటికీ ఏదైనా మార్పు ఉండొచ్చేమో అని ఫిలిం నగర్ టాక్. కానీ ఫైనల్ గా తనే ఫిక్స్ అయ్యింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.
శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.
మొన్నే షూటింగ్ ని రీ స్టార్ట్ చేశారు. థియేటర్లలో వస్తుందా లేక ఓటిటికి ఇస్తారా అనే విషయం ఇంకా ఖరారు కాలేదు కానీ హ్యాట్రిక్ డిజాస్టర్ల తర్వాత శర్వా ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. కిషోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన శ్రీకారం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాగానే మహాసముద్రంలో జాయిన్ అవుతాడు శర్వా. మరోవైపు సిద్దార్థ్ తన తమిళం కమిట్ మెంట్స్ చేసుకుంటూనే శర్వానంద్ కు షూట్ లో తోడవుతాడు. మహాసముద్రం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందుతుందని ఇన్ సైడ్ టాక్. శర్వానంద్ క్యారెక్టర్ లో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని వినికిడి.
ఇది ఏడాదికి పైగా ఎందరో హీరోలకు వద్దకు వెళ్ళి వచ్చిన సబ్జెక్టు. రామ్, నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రవితేజ అందరికీ కథ నచ్చినా ఏవో కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది. ఫీమేల్ లీడ్ కు సమంతాను కూడా అనుకున్నారు. కానీ ఆఖరికి ఎన్నో మలుపులు తిరిగి అదితిని చేరుకుంది. ఇటీవలే వచ్చిన విలో తన మేజిక్ అంతగా పని చేయలేదు. సమ్మోహనం సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన తీరు ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది. ఇప్పుడీ సినిమా కూడా తన పెర్ఫార్మన్స్ ని డిమాండ్ చేసే కథే కాబట్టి ఖచ్చితంగా ఛాలెంజింగ్ గా ఉండొచ్చు. డిసెంబర్ లేదా జనవరిలో షూటింగ్ మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా వినికిడి. ఆరెక్స్ 100 తర్వాత ఏకంగా రెండేళ్లకు పైగా తీసుకున్న అజయ్ భూపతికి ఇది హిట్ కావడం చాలా అవసరం.