iDreamPost
android-app
ios-app

మద్యం బ్రాండ్స్ ,రేట్లు

  • Published Dec 16, 2019 | 4:43 PM Updated Updated Dec 16, 2019 | 4:43 PM
మద్యం బ్రాండ్స్ ,రేట్లు

గతంలో చాలా మద్యం బ్రాండ్స్ ఉండేవి . ఇప్పుడు అన్ని బ్రాండ్స్ దొరకట్లేదు , రేట్లు కూడా పెరిగాయి-ఈ ప్రశ్న అడగటానికి మరెవరూ దొరకనట్టు మహిళా ఎమ్మెల్యే భవానీ చేత ఆడిగించాలా బాబూ . దీని పై వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే సాధినేని యామినీ గారికి మల్లెపూల టాగ్ ఎలా నిలిచిపోయిందో భవానీ గారికి మద్యం టాగ్ అలా చిరకాలం నిలిచిపోయేట్టు ఉంది . బహుశా బాబు ఆలోచన కూడా అదే కావొచ్చు.. మహిళా ఎమ్మెల్యే మీద అధికారపక్ష ట్రోలింగ్ అని దాడికి దిగాలనుకున్నారేమో!

భవానీ గారి మరో ప్రశ్న , ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు , మాట తప్పారు .

వైసీపీ మేనిఫెస్టో చూసిన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదండీ దశల వారీగా మధ్యపానాన్ని నిషేధిస్తా అని ఇచ్చిన హామీ అందరూ జగన్ నోటి వెంట విన్నారు . మేనిఫెస్టోలో పత్రికల్లో చూసారు . ప్రజలందరికీ తెలిసిన నిజాన్ని అబద్ధం అని తాను ఆరోపించకుండా పక్కనోళ్ళ చేత ఆరోపణ చేయించి వాళ్ళ క్రెడిబులిటీ దెబ్బతీసైనా తనపని నెరవేర్చుకొనే బాబు గారి నైజం తెలిసీ ఎలా పప్పులో కాలేశారు మేడం .

ఇహ నకిలీ మద్యం , నాటుసారా పెరుగుతుందని , మద్యం ఆదాయం కూడా పెరిగింది అని భవానీ గారు చేసిన ఆరోపణలలో సత్యం ఏంతో లెక్కలతో మాట్లాడి ఉంటే బాగుండేది. రాత్రి 8 గంటలకే మద్యం షాపులు మూసివేస్తుండటంతో మద్యం అమ్మకాలు తగ్గాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఊర్లలో కూడా ప్రజలు తవర్గా ఇంటికి చేరుకుంటున్నారు.

ఒక మహిళా ఎమ్మెల్యేకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆవిడ ఆలోచనల ప్రకారం మాట్లడిస్తే బాగుండేది. మహిళా సంక్షేమం,బాలికల రక్షణ ఇలా అనేక అంశాలు ఉండగా మద్యం మీద ఆవిడతో మాట్లాడించటం రాజకీయంకా మరేంటి?అసలు ప్రస్తుతం దేశం చూపు మొత్తం మన రాష్ట్రం వైపు తిప్పుకొన్న దిశ చట్టం పై నిర్మాణాత్మకంగా భవానీ గారు మాట్లాడితే బాగుండేది.

ఇంకా మన రాష్ట్రంలో మహిళల పట్ల జరిగిన కొన్ని దుర్ఘటనలు గురించి సభ దృష్టికి తీసుకొచ్చి సత్వర చర్యలకు దోహదం చేసే అవకాశం ఆమె చేతుల్లోనుండి లాగేసారు .30 లక్షల పై చిలుకు ఉన్న ఆడపిల్లల సమస్యల గురించి ఓ తల్లి కోణంలో ఆలోచించి వారికి కావలసిన సౌకర్యాల గురించి చర్చించేవారేమో . 96 లక్షల మందికి పై చిలుకు మహిళలు ఉన్న డ్వాక్రా గ్రూపుల గురించి , వారి సమస్యల గురించి డ్వాక్రా గ్రూప్ ఉత్పత్తుల మార్కెటింగ్ గురించి చర్చ చేసే అవకాశాన్ని ఆమె చేతుల్లోనుండి లాగేసుకొని ఆ సువర్ణ హస్తాలకు మీ రాజకీయ మద్యం మకిలి అంటించారే! 

ఏదేమైనా బాబు తన పాత రాజకీయ ఎత్తుగడలను మార్చుకున్నట్లు లేదు,భవానీ గారు కూడా భవిషత్తులో ఇలాంటి ప్రశ్నలకు దూరంగా ఉంటె బాగుంటుంది. శాసనసభలో తనకు మాట్లాడటానికి వచ్చే అవకాశాలను మహిళా సంబంధిత అంశాల కోసం ఉపయోగించుకుంటే బాగుంటుంది.