iDreamPost
android-app
ios-app

Adipurush : డార్లింగ్ ప్రభాస్ లుక్ వైరల్

  • Published Jun 15, 2022 | 2:54 PM Updated Updated Jun 15, 2022 | 2:57 PM
Adipurush : డార్లింగ్ ప్రభాస్ లుక్ వైరల్

డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ ఇంట్లో ఇచ్చిన పార్టీకి ఆదిపురుష్ సినిమా టీం హాజ‌రైయ్యంది. ప్ర‌భాస్, సైఫ్ ఆలీ ఖాన్, క్రితీ స‌న‌న్ తోపాటు నిర్మాత కూడా వ‌చ్చారు. ఈ బిగ్ బ‌డ్జెట్ ఆది పురుష్ లో ప్ర‌భాస్ రాఘ‌వ‌( రాముడు)గా క‌నిపించ‌నున్నారు. అప్పుడే పాపరాజ్జి ఫోటోగ్రాఫ‌ర్ ల‌కు ఇద్ద‌రూ చిక్కారు. రామ‌య‌ణాన్ని కొత్త త‌ర‌హాలో చెబుతున్న ఆదిపురుష్ మీద ప్ర‌భాష్ కి గ‌ట్టిన‌మ్మ‌క‌ముంది. ఈసినిమా మీద బాలీవుడ్ లో బాగా బ‌జ్ వ‌చ్చింది.

బ్లాక్ జీన్స్ లో మెరూన్ టాప్ లో ప్ర‌భాస్ లుక్స్ కి బాలీవుడ్ అదిరిపోయింది. బ‌రువు త‌గ్గిన‌ట్లు ప్ర‌భాస్ క‌నిపిస్తున్నారు. స‌న్న‌బ‌డ్డారు.

ఓమ్ రౌత్ తో ప్ర‌భాస్ ఫోటోలు బాగా వైర‌ల్ అయ్యాయి. T-Series, Retrophiles Pvt Ltd నిర్మిస్తున్న ఆదిపురుష్ నిజ‌మైన పాన్ ఇండియ‌న్ మూవీ.

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సినిమా స‌లార్ లో ప్ర‌భాస్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత మారుతీ సినిమాను ప‌ట్టాలెక్కించొచ్చు. అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ వంగా సినిమా, స్పిరిట్ మీద బాలీవుడ్ కు మంచి న‌మ్మ‌క‌ముంది.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)