iDreamPost
android-app
ios-app

Krithi Shetty : చాలా తెలివిగా కృతి కెరీర్ ప్లానింగ్

  • Published Jan 11, 2022 | 6:18 AM Updated Updated Jan 11, 2022 | 6:18 AM
Krithi Shetty : చాలా తెలివిగా కృతి కెరీర్ ప్లానింగ్

ఏ ముహూర్తంలో ఉప్పెన ఆఫర్ వచ్చిందో కానీ దాని సక్సెస్ తో మొదలుపెట్టి హీరోయిన్ కృతి శెట్టి గ్రాఫ్ మాములుగా ఎగబాకడం లేదు. ఇటీవలే వచ్చిన నాని శ్యామ్ సింగ రాయ్ కూడా హిట్ క్యాటగిరీలో పడటంతో నెక్స్ట్ బంగార్రాజుతో హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకంలో ఉన్నారు అభిమానులు. సుధీర్ బాబుతో చేసిన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, లింగుస్వామి దర్శకత్వంలో రామ్ కు జోడిగా నటించిన కొత్త సినిమాల షూటింగులు సగానికి పైగా పూర్తయ్యాయి. తమిళం నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇదిలా ఉండగా కృతి శెట్టికి అప్పుడే ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్స్ వస్తున్నట్టుగా తెలిసింది. అది కూడా మెగా కాంపౌండ్ నుంచి.

సుస్మిత కొణిదెల నిర్మించబోయే సినిమాలో కృతి ప్రధాన పాత్రలో చేయబోతున్నట్టు సమాచారం. దర్శకుడు విరించి వర్మ. ఈయన గతంలో ఉయ్యాలా జంపాల, మజ్నులతో మంచి పేరే తెచ్చుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత ఈ సబ్జెక్టుతో సుస్మితని ఒప్పించినట్టు తెలిసింది. కథ మొత్తం అమ్మాయి చుట్టే తిరుగుతుందని పెర్ఫార్మన్స్ కు ఫుల్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో కృతి ఆల్మోస్ట్ ఓకే చెప్పిందని అంటున్నారు. ఇటీవలే సుస్మిత ఆహా కోసం నిర్మించిన రాజేంద్రప్రసాద్ సేనాపతి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తీయబోయేది యాప్ కోసం కాదట. థియేట్రికల్ మూవీగానే ప్లాన్ చేశారట.

నిజానికి ఇలాంటి క్యారెక్టర్లు కెరీర్ ప్రారంభంలోనే ఒప్పుకోవడం ద్వారా కృతి కొంత రిస్క్ చేస్తున్నట్టే. ఎందుకంటే గ్లామర్ బ్యూటీగా డిమాండ్ ఉన్న టైంలో స్టార్ హీరోల పక్కన జోడిగా చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే కృతి శెట్టి మాత్రం అనుష్క శెట్టి దారిలో నడవాలని ప్లాన్ చేసుకుంది కాబోలు. మరి ఇప్పుడు చేయబోయే సినిమా ఏ జానర్ అనేది తెలిస్తే అప్పుడు ఎంతవరకు ఉపయోగపడగలదో చెప్పగలం. బంగార్రాజు ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొన్నట్టున్న కృతి శెట్టికి దాని మీద గట్టి నమ్మకమే ఉంది. ఇది కనక సోగ్గాడే చిన్ని నాయనా రేంజ్ లో హిట్ అయితే స్టార్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చనే నమ్మకం ఉండొచ్చు

Also Read : Actor Siddharth : సైనా మీద సిద్దార్ద్ వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి మహిళా కమిషన్

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet