Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ గురించి.. పార్టీలోని నాయకత్వం గురించి.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మనసులో ఏముందో కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన వీడియో ద్వారా తెలిసిందేగా. సీన్ కట్ చేస్తే.. చంద్రబాబు కేక్ కటింగ్ రోజున అదేనండి పుట్టినరోజున ఆయనను పొగిడారండీ.. ఆ మాటలకు వీడియోలో తిట్టిన తిట్లన్నీ మరిచిపోయి చంద్రబాబు, లోకేశ్ బాబు అచ్చెన్నను కౌగిలించుకోవాల్సిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి జన్మదినం సందర్భంగా.. అచ్చెన్నాయుడు బాబుని ఆకాశానికెత్తేశారు. బాబు వంటి రాజకీయ నాయకుడు లేనే లేరు అంటూ కీర్తించారు. నాలుగు దశాబ్దలా అనుబ్దాల అనుభవంతో చంద్రబాబు రాష్ట్రానికి విశేష సేవలు అందించారని కూడా ప్రశంసించారు. దేశానికి ఎందరో ప్రధానులను రాష్ట్రపతులను అందించిన ఘనత బాబుదేనని అచ్చెన్న చాలా చెప్పారు. బాబును మళ్ళీ ఏపీకి ముఖ్యమంత్రిని చేసేంతవరకూ విశ్రమించరాదని ఆయన క్యాడర్ కి పిలుపు ఇచ్చారు.
అచ్చెన్నది ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత పార్టీలో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. కలిసి కార్యక్రమాలు చేస్తున్నా, పైపైకి నవ్వుకుంటున్నా.. ఆ ఇద్దరికి, అచ్చెన్నకు అంతగా పొసగడం లేదని పార్టీ వర్గాల్లో టాక్. వీడియో గురించి పర్సనల్ గా వివరణ తీసుకున్నా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దాని నుంచి బయటపడేందుకు అచ్చెన్నాయుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీని, నన్ను ఎవరూ వేరుచేయలేరని, లోకేశ్ కు, నాకు విభేదాలు పెట్టలేరని… ఇలాంటి వ్యాఖ్యలెన్నో చేస్తున్నారు. అయినా మసాలా చాలలేదు అనుకున్నారో ఏమో, పుట్టినరోజు సందర్భంగా బాబును తెగ పొగిడేశారు. 40 సంవత్సరాలుగా కష్టాన్ని, శ్రమను నమ్ముకున్న వ్యక్తి అని.. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడని చంద్రబాబును ఆయన కొనియాడారు. ఉమ్మడి ఏపీకి సుదీర్ఘ కాలం సీఎంగా పని చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన చేయని పదవులు లేవన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. మరి ఆ తిరుపతిలో 17 తర్వాత పార్టీ లేదు బొక్కా లేదు అన్నది ఇదే అచ్చెన్న కదా అంటూ వైసీపీ నేతలు కౌంటర్ లు ఇస్తున్నారు.