iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా కోర్టు వ్యవహారాలే రాజకీయాల్లో కీలకంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇక కోర్టు తీర్పులు,వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వాన్ని బద్నాం చేసే యత్భం కూడా బాహాటంగానే సాగుతోంది. దానికి ఓ వర్గం మీడియా మూలంగా ఉంది. ప్రతీ కేసులోనూ విచారణ సందర్భంగా బెంచ్ నుంచి చేసే చిన్న చిన్న వ్యాఖ్యలు భూతద్దంలో చూపడం సర్వసాధారణం అన్నట్టుగా మారింది. కొన్నిసార్లు పిటీషనర్ తరుపు న్యాయవాదులు చేసే ఆరోపణలనే హెడ్డింగు పెట్టి పాఠకులు, వీక్షకులను మభ్యపెట్టడానికి తెగించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం ఆరోపించినట్టు కొందరు న్యాయమూర్తుల బెంచ్ నుంచి వెలువడే ఉత్తర్వులు, వ్యాఖ్యానాల ఆధారంగా మరింత చెలరేగిన అనుభవాలు చాలా ఉన్నాయి.
Image Source: eenadu
కొన్ని నెలలుగా అలాంటి కథనాలను అలవాటుగా మార్చుకున్న వారికి తాజా పరిణామాలు మింగుడుపడడం లేదనే చెప్పాలి. అందుకు అనుగుణంగానే తాజా పరిణామాలను కూడా ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి కి ముడిపెట్టే యత్నాలు మొదలెట్టారు. ఏపీ హైకోర్టు లో జస్టిస్ రాకేష్ కుమార్, ఉమాదేవి బెంచ్ నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం ప్రదర్శించింది. హైకోర్టు బెంచిని మందలిస్తూ, ఇలాంటి తీరు ఆందోళనకరం అని పేర్కొంది. దాంతో ఏపీలో రాజ్యాంగ సంక్షోభం అంటూ విచారణ ప్రారంభించిన జస్టిస్ రాకేష్ కుమార్ బెంచ్ దానిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ఏపీ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా వక్రీకరించే యత్నం యథేచ్ఛగా సాగింది. పైగా దమ్మున్న ఛానెల్ అంటూ చెప్పుకునే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో జగన్ ఫోటో వేసి సుప్రీంకోర్టు మందలింపు అని పేర్కొనడం వారి విపరీత పోకడలకు దర్పణం పడుతుంది. పైగా తాను న్యూట్రల్ అని చెప్పుకునే వెంకట కృష్ణ ప్యానెల్ డిస్కషన్ లో చేసిన వ్యాఖ్యలు సగటు జర్నలిస్ట్ సిగ్గుపడే స్థాయిలో ఉన్నాయి. చివరకు ఆయన డిస్కషన్ నుంచి ఓ న్యాయ నిపుణుడు లేచి వెళ్లిపోయేందుకు సిద్ధపడడం చూస్తే చర్చ పేరుతో అతడు ఎంత రచ్చ చేస్తున్నాడో అర్థం అవుతుంది.
Image Source: prabhanews
జనంలో తన పట్టు పెంచుకునే పనిలో జగన్ ఉన్నారు. కానీ పచ్చ మీడియా మాత్రం జగన్ ని, జనాలకు దూరం చేయాలనే కక్షతో ఇలాంటి ప్రయత్నాలు సాగిస్తోందంటూ సామాన్యుడికి సైతం అర్థమయ్యాలా పచ్చమిడియా ప్రయత్నిస్తోంది. ఫలితాలు రాకపోయినా పదే పదే అదే చెప్పి సాధారణ ప్రజలను పక్కదారి పట్టించగలమని ఆశిస్తోంది. అందుకోసం చివరకు సుప్రీంకోర్టు నేరుగా హైకోర్టు ని మందలిస్తే అది జగన్ నే అన్నట్టుగా రాతలు, కూతలు వల్లిస్తోంది. గతంలో బాబుకి బైబై చెప్పి ఎవరైనా నేత జగన్ దగ్గరికి చేరినా జగన్ కి షాక్ అని రాసిన రాధాకృష్ణ మీడియాలో ఇప్పుడు జగన్ ప్రభుత్వ పిటిషన్ లో అనుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా వక్రీకరిస్తోంది. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.