చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించి ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ను రాష్ట్రప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని కేంద్ర హోం శాఖ సమర్ధించింది. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి పై ప్రాధమిక ఆధారాలున్నాయని కేంద్ర హోం శాఖ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు అక్రమ అవినీతి వ్యవహారాల మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని, ఆయనపై చ్చార్జీషీట్ దాఖలు చెయ్యాలని కేంద్ర హోం శాఖ శనివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలిసు శాఖ ఆధునీకరణ పేరుతో ఏబీ వెంకటేశ్వరరావు 25 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, దేశభద్రతకు సంబంధించిన విషయంలో ఇజ్రాయిల్ కంపెనీతో సమాచారాన్ని పంచుకున్నారని రాష్ర ప్ప్రభుత్వం ఇప్పటికే ఏబీ వెంకటేశ్వర రావుని విధులనుండి సస్పెండ్ చేసి అతని మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఏబీ వెంకటేశ్వర రావుపై వచ్చిన ఆరోపణలపై ప్రాధమిక విచారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆనివేదికను ఇటీవలే కేంద్ర హోం శాఖ కు అందచేసింది. ఈ సందర్భంగా కేంద్ర సర్వీసు అధికారైన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై స్పందించిన కేంద్ర హోం శాఖ కు చెందిన అధికారి రాజీవ్ కుమార్ నిగమ్.. ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను సమర్ధిస్తూ, ఏప్రిల్ 7 లోగా అతనిపై ఛార్జ్ షీట్ నమోదు చెయ్యాలని రాష్ట్రప్రభుత్వాన్నిఆదేశిస్తూ శనివారం కీలక ఉత్తర్వులు జారీచేశారు.
ఏబీ వెంకటేశ్వర రావు రాష్ట్ర ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో కొన్ని విదేశీ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని, రాష్ట్రానికి, అదేవిధంగా దేశానికి సంభందించిన భద్రతా నిబంధనలను ఉల్లంఘించారని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఆతన్ని సస్పెండ్ చేసింది. అంతేకాక పోలిసు శాఖ ఆధునీకరణ పేరుతో తన కుమారుని కంపెనీకి లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరించారని, కేంద్ర ప్రభుత్వ అధికారి అయ్యుండి కేంద్ర హోం శాఖ మ్యానువల్ కి విరుద్ధంగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారని ఆయనమీద ప్రధాన ఆరోపణ .
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఈ నేపధ్యలోనే అతన్ని నాటి ప్రభుత్వం రాష్ట్ర ఇంటిలిజెన్స్ చీఫ్ గా నియమించింది. అయితే అయన తన అధికారాల్ని, పోలీసు యంత్రంగాన్నీ దుర్వినియోగం చేస్తూ.. తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలను కాపాడేవిధంగా వ్యవహరించేవారని, చంద్రబాబుకు రాజకీయ సలహాదారులా పనిచేసేవారిని ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. ఒకదశలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలంటే ముందు ఏబీ వెంకటేశ్వర రావుతో మాట్లాడి ఆయన అనుమతి పొందాల్సిందేనని అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఆయన వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాక అప్పటి ప్రతిపక్ష వైసిపికి సంభందించిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించమని ఏబీ వెంకటేశ్వర రావు ఒత్తిడి తీసుకొస్తున్నాడని స్వయంగా వైసిపి ముఖ్యనాయకులే అనేకసార్లు ఆరోపించారు.
ఒకదశలో తెలుగుదేశంలో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలో.. ఎవరికీ ఇవ్వకూడదు కూడా.. ఏబీ వెంకటేశ్వర రావు నిర్ణయించేవాడని, అందువల్ల తమ రాజకీయ భవిష్యత్ ఎక్కడ దెబ్బతింటుందోనని తెలుగుదేశం బడా బడా నేతలు కూడా అయన్ని ప్రసన్నం చేసుకోవడానికి పోటి పడేవారంట!! ఇటీవల తెలుగుదేశానికి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ట్విటర్ ద్వారా ఇదే అంశాన్ని గుర్తు చేసిన సంగతి తెలిసిందే. చంద్ర బాబు హయాంలో అత్యంత వివాదాస్పదుడిగా ముద్రపడిన ఏబీ వెంకటేశ్వర రావుని కేంద్ర ఎన్నికల సంఘం గత ఎన్నిక సమయంలో విధులనుంచి కూడా తప్పించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తాజాగా జారీచేన ఉత్తర్వుల నేపథ్యంలో తెలుగుదేశం వర్గాల్లో గుబులు మొదలైంది.
మాములుగా కేంద్ర క్యాడర్ అధికారులు తమకు ఏదైనా అన్యాయం జరిగిందని భావిస్తే క్యాట్ ట్రిభ్యునల్ ని ఆశ్రయిస్తుంటారు. సహజంగా క్యాట్ లో అధికారులకు కొంత వెసులుబాటు లభిస్తుంది. ఇది అనేక సంవత్సరాల నుండి జరుగుతున్న తంతే. అయితే సదరు అధికారులు తమ సర్వీసులకు సంభందించిన వివాదాలను కోర్ట్ లలో కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
అయితే మన రాష్ట్రంలో ఒక వర్గానికి చెందిన మీడియాలో మాత్రం గతంలో సపెన్షన్ కు గురైన ఐఏఎస్ అధికారి జాష్టి కిషోర్ విషయంలో కానీ, ఏబీ వెంకటేశ్వర రావు విషయంలో కానీ క్యాట్ ట్రిబ్యునల్ విషయంలో ఎదో జరిగిపోయినట్టు ఇచ్చిన బిల్డప్ చూసి ఐఏఎస్ అధికారులు సైతం ముక్కున వేలేసుకున్నారు. కేంద్ర సర్వీసు అధికారులకు సహజంగా క్యాట్ ట్రిబ్యునల్ లో కొంత ఇమ్మ్యూనిటీ ఉన్నదనేది మాత్రమే వాస్తవం. అంతకు మించి క్యాట్ ట్రిబ్యునల్ కు పూర్తి నిర్ణయాధికారం లేదనేది వాస్తవం. అయితే ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగానే విస్మరించి ఎదో జరిగిపోయినట్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులు మొట్టికాయలు వేసినట్టు.. అసత్య ప్రచారాలను వండి వార్చాయి. మరి ఏబీ వెంకటేశ్వర రావు పై కేంద్ర హోం శాఖ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మన మీడియా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.