iDreamPost
android-app
ios-app

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవడం, భద్రతా ఉపకరణాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ సర్కార్‌ సస్పెండ్‌ చేసిన ఇంటిలిజెన్స్‌ మాజీ ఛీప్‌ ఐబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లో తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్‌ను సమర్థిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌(క్యాట్‌) ఇచ్చిన ఆదేశాలను సైతం పక్కన పెట్టిన హైకోర్టు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. సస్పెన్షన్‌ కాలంలో కూడా పూర్తి జీత భత్యాలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.

గత ప్రభుత్వ హాయంలో ఇంటిలిజెన్స్‌ బ్యూరో ఛీప్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంగా ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ టీడీపీకి అనుకూలంగా పని చేస్తూ అవసరమైన సమాచారం సేకరించి చేరవేశారన్న విమర్శలు వైసీపీ నేతలు చేశారు. ముఖ్యమైన పదవిలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఆయన కుమారుడు కంపెనీకి ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.