iDreamPost
iDreamPost
ఇంకా పుష్ప రెగ్యులర్ షూటింగ్ మొదలుకానే లేదు అప్పుడే బన్నీ 21 పనులు ఏమిటా అని ఆశ్చర్యపోకండి. లాక్ డౌన్ వల్ల భవిష్యత్తులో చేయాల్సిన పనులు కూడా ఇప్పుడే పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆచార్యకు ఏడు నెలల లాంగ్ బ్రేక్ దొరకడంతో దర్శకుడు కొరటాల శివ ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయడమే కాకుండా ఏకంగా అధికారిక ప్రకటన కూడా ఇప్పించేశాడు. ఈ ఇద్దరు చేస్తున్న ప్రస్తుత సినిమాలు పూర్తి కాగానే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మళ్ళీ మణిశర్మనే ఎంచుకోబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. కొరటాల శివ కెరీర్లో మొదటి నాలుగు సినిమాలు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేనులకు మ్యూజిక్ ఇచ్చింది దేవీశ్రీ ప్రసాద్.
ఆచార్య దగ్గరకు వచ్చేటప్పటికి ఇస్మార్ట్ శంకర్ ఆల్బం దెబ్బకు చిరంజీవి పర్సనల్ గా మణిశర్మను రికమండ్ చేశారు. గతంలో ఈ కాంబోలో ఎన్నో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కూడా ఈ వార్త విన్న తరవాత ఎగ్జైట్ అయ్యారు. ఇప్పటిదాకా జరిగిన వర్క్ కు సంబంధించి బ్యాక్ స్కోర్ కి ఫిదా అయిన శివ నెక్స్ట్ కూడా తనతోనే వర్క్ చేయాలనీ డిసైడ్ అయ్యారని ఇన్ సైడ్ టాక్. అల్లు అర్జున్ మణిశర్మ కాంబినేషన్లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు పరుగు,వరుడు. పరుగు హిట్టయ్యింది కానీ వరుడు డిజాస్టర్ ఫలితం అందుకుంది. పాటలు కూడా సోసోగానే వచ్చాయి. సో ఆ లోటుని పూడ్చడానికి మణిశర్మ గట్టిగా చేస్తారని వేరే చెప్పనక్కర్లేదు.
దీంతో పాటు హీరొయిన్ గా దిశా పటానిని ఎంచుకునే ఆలోచన కూడా చేస్తున్నారట. పుష్ప నుంచి ఎలాగూ అన్ని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్న అల్లు అర్జున్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఒకవేళ దిశా కంటే బెటర్ ఛాయస్ దొరికితే కనక షిఫ్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మొత్తానికి పనులు మాత్రం తెరవెనుక వేగంగా జరుగుతున్నట్టు అర్థమవుతోంది. ఆచార్య, పుష్పలు కాస్త అటుఇటుగా వచ్చే ఏడాది వేసవికంతా పూర్తైపోతాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెడతారు. 2022 సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ ప్లాన్ చేయమని బన్నీ ఇప్పటికే కొరటాల శివకు చెప్పాడట. అల వైకుంఠపురములో ఇచ్చిన కిక్ అలాంటిది మరి