iDreamPost
android-app
ios-app

రైలులో బెల్లీ డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో వైరల్

రైలులో బెల్లీ డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో వైరల్

వెర్రి వెయ్యి విధాలు అన్న సామెతను నిజం చేసి చూపిస్తున్నారు నేటి యువత. ట్రెండింగ్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కొంత మంది యువతీ యువకులు. రోడ్లపై బైకులతో స్కిట్స్ చేస్తున్నారు. బైక్ పై అమ్మాయిని కూర్బొబెట్టుకుని ముద్దులతో రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్లలోనే కాదూ మెట్రో సర్వీసుల్లో కూడా వెకిలి చేష్టలకు పాల్పడుతూ కంట పడిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు తామేమీ తీసిపోవడం లేదని నిరూపిస్తున్నారు. ఫేమ్ కోసం రైల్వే స్టేషన్లలో డ్యాన్సులు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వైరల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి చర్యల వల్ల కొన్ని సార్లు వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా అటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ముంబయి లోకల్ ట్రైన్‌లో ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. శాండ్ హార్ట్స్ రోడ్, మసీద్ స్టేషన్ల మధ్య నడుస్తున్న రైలులో ఆమె డ్యాన్స్ చేసింది. ఆ వీడియోకు భారీ స్పందన లభించింది. అదే సమయంలో కొంత మంది ఆమె చర్యలను తప్పుబుడుతూ.. ఆ యువతి అసభ్యకర రీతిలో డ్యాన్స్  చేసిందంటూ ముంబయి పోలీసులకు సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేశారు. దీంతో ఇది కాస్తా ముంబయి పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ ఆ వీడియోను ముంబయి రైల్వే పోలీస్ కమిషనరేట్ ఖాతాకు ట్విట్టర్ (అలియాస్ ఎక్స్)కు ట్యాగ్ చేశారు.  రైల్వే పోలీసులు ఆ యువతి ఎవరు అని విచారణ  చేస్తున్నారు.