Swetha
ఉద్యోగులంతా కూడా ఉరుకుల పరుగుల జీవితాలు గడుపుతూ ఉంటారని అందరికి తెలిసిందే. అయితే, తాజాగా ఒక ఉద్యోగిని తానూ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాని చెప్పినా కూడా.. ఆ సంస్థ యజమాని సెలవు ఇవ్వట్లేదంట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఉద్యోగులంతా కూడా ఉరుకుల పరుగుల జీవితాలు గడుపుతూ ఉంటారని అందరికి తెలిసిందే. అయితే, తాజాగా ఒక ఉద్యోగిని తానూ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాని చెప్పినా కూడా.. ఆ సంస్థ యజమాని సెలవు ఇవ్వట్లేదంట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.
Swetha
ఇప్పుడున్న ఉద్యోగులకు ఆఫీసులలో అనేక సదుపాయాలు ఉంటూనే ఉంటున్నాయి. మంచి జీతాలే కాకుండా అన్ని వెసులుబాట్లు కల్పించే విధంగా ఆయా సంస్థలు బాధ్యత వహిస్తున్నాయి. కానీ అవసరం అయినపుడు సెలవులు మాత్రం ఇవ్వడం లేదు కొన్ని సంస్థలు. ఇటీవల సోషల్ మీడియాలో తన తండ్రి మరణించిన కారణంగా ఒక ఉద్యోగిని సెలవు కావాలని అడిగినప్పుడు ఆ సంస్థ యజమాని పెట్టిన మెసేజ్ వైరల్ అయింది. ఇక ఇప్పుడు అలానే తానూ అనారోగ్యంతో ఉన్నానని చెప్పినా కూడా.. ఆఫిస్ కు రమ్మని ఒక బాస్ పెట్టిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మెసేజ్ చూస్తే ఇటువంటి బాస్ లు కూడా ఉంటారా అని అందరూ నోటి మీద వేలు వేసుకోక మానరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనారోగ్యంతో ఉన్న తన తల్లిని ఆమె బాస్ తిరిగి ఎలా పనిలోకి రమ్మంటున్నాడో చుడండి అంటూ.. ఒక మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ అందరికి ఆశ్చర్యపరుస్తుంది. తాము అనారోగ్యంతో ఉన్నామంటే ఏ సంస్థ యజమాని అయినా సరే.. లీవ్ తీసుకోమని అంటారు. అందులోను అది ప్రాణాంతక వ్యాధి అయితే మాత్రం ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలే చెబుతూ ఉంటారు. అయితే.. ఇక్కడ ఒక బాస్ మాత్రం ఆ మహిళా స్టేజ్ 4 క్యాన్సర్ తో బాధపడుతున్నానని చెప్పినా కూడా.. ఆ సంస్థ యజమాని ఆమెను ఆఫీస్ కు రమ్మని అడుగుతూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ ను గమనిస్తే.. అందులో.. “మీరు చికిత్స తీసుకుంటున్న ఆంకాలజిస్ట్ నుంచి మీరు పనికి తిరిగి.. రావడానికి సరిపోతారనే ఒక లెటర్ తీసుకురండి. మీ ట్రీట్మెంట్ ను బట్టి.. మన వర్క్ ప్లాన్ చేసుకుందాం. రేపు మీటింగ్ కు అటెండ్ అవ్వండి .” అంటూ ఆ స్క్రీన్ షాట్ లో ఉంది. దీనిని సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక ఆ మహిళా కుటుంబ సభ్యులు కూడా.. దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చావు బ్రతుకులతో పోరాడుతున్న వ్యక్తి ఆఫీస్ కు రాగలదా లేదా అని కూడా ఆలోచించకుండా.. డైరెక్ట్ గా మీటింగ్ కు రావాలని ఆదేశించడం ఏ మాత్రం సరైనది కాదు అని వాపోతున్నారు. ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పోటీ ప్రపంచంలో తాము ముందుండాలనే ఆలోచనతో.. ఉద్యోగుల వ్యక్తిగత విషయాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు యజమానులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.