SNP
Transgender, Viral Video: హిజ్రాలు రైళ్లలో డబ్బులు అడుగుతుండటం చూసే ఉంటారు. కానీ, ఇలాంటి ఘటన మాత్రం ఎవరు చూసి ఉండరు. పట్టపగలే ఓ హిజ్రా యువకుడిని టాయిలెట్‌లోకి లాక్కెళ్లింది. ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Transgender, Viral Video: హిజ్రాలు రైళ్లలో డబ్బులు అడుగుతుండటం చూసే ఉంటారు. కానీ, ఇలాంటి ఘటన మాత్రం ఎవరు చూసి ఉండరు. పట్టపగలే ఓ హిజ్రా యువకుడిని టాయిలెట్‌లోకి లాక్కెళ్లింది. ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
రైళ్లలో కొంతమంది హిజ్రాలు వచ్చి ప్రయాణికుల నుంచి డబ్బులు అడిగి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మగవారి నుంచి కనీసం రూ.10 అయినా వసూలు చేస్తుంటారు. తమకు ఎవరూ పని ఇవ్వరని, తాము బతకాలంటే ఇది తప్ప ఇంకో మార్గం లేదంటూ.. డబ్బులు ఒకింత డిమాండ్‌తోనే అడుగుతుంటారు. డబ్బులు ఇవ్వకుంటే కొన్ని సార్లు వాళ్లు అసభ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా సంఘటనలు ట్రైన్స్‌లో సర్వసాధారణమైపోయాయి. కానీ, ఈ సంఘటన మాత్రం నవ్వు తెప్పించేలా ఉన్నా.. ప్రయాణికుల భద్రతను క్వశ్చన్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఓ ట్రైన్‌లో కొంతమంది యువకులు బాత్‌రూమ్, డోర్ దగ్గర నిల్చున్నారు. అక్కడే ఓ హిజ్రా వారిని డబ్బులు అడుతూ చప్పట్లో కొడుతోంది. కానీ, ఇంతలో ఏమైందో ఏమో కానీ, ఓ కుర్రాడ్ని బలవంతంగా అక్కడే ఉన్న బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న మరికొంతమంది యువకులు డోర్‌ను ఎంత సేపు కొట్టినా తీయలేదు. కొద్ది సేపటి తర్వాత డోర్ తీసి బయటికి వచ్చి.. వేరే బోగిలోకి వెళ్లిపోయింది. ఆ కుర్రాడు కూడా బాత్ రూమ్ నుంచి బయటికి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనపై సీరియస్ అవుతున్నారు. రైళ్లలో భద్రత కరువైందని మండిపడుతున్నారు. కొంతమంది హిజ్రాల ఆగడాలు మితిమీరి పోతున్నాయని పేర్కొంటున్నారు. ట్రైన్స్‌లోనే కాక.. పెళ్లిళ్లు, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగిన సమయంలో పది, పదిహేను మంది వరకు వచ్చేసి.. వేలల్లో డబ్బు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే నానా హడావిడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం కొద్ది ఎంత ఇస్తే అంత తీసుకోని వెళ్లకుండా.. మాకు ఇంత కావాలని డిమాండ్ చేస్తున్నారంటూ మరికొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే.. ఓ యువకుడిని హిజ్రా బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Boys are not safe in public places pic.twitter.com/5GS1SB7E7g
— Kattappa (@GANESHV81214930) April 4, 2024