Keerthi
తాజాగా జ్యోతిష్యం చెప్పే ఓ పూజారి.. జ్యోతిష్యం పేరుతో చేసే పని తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆ పేరుతో రెండు కోట్లు వసూలు చేసి ఊడాయించాడు. ఇంతకి ఏం జరిగిందంటే..
తాజాగా జ్యోతిష్యం చెప్పే ఓ పూజారి.. జ్యోతిష్యం పేరుతో చేసే పని తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆ పేరుతో రెండు కోట్లు వసూలు చేసి ఊడాయించాడు. ఇంతకి ఏం జరిగిందంటే..
Keerthi
ఈ సమాజంలో మోసం చేసిన వాళ్లు ఉన్నంతా కాలం మోసపోయిన వాళ్లు చాలామంది పెరుగిపోతున్నారు. ఉంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ ఈజీగా మనీ సంపాదించాలనే ఆత్యాశ బాగా పెరిగిపోయింది. అందుకోసం రకరకాల స్కామ్ లు, అడ్డదారులు తొక్కుతూ అమాయకపు ప్రజలను మోసం చేస్తూ లక్షలు డబ్బులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జ్యోతిష్యం చెప్పే ఓ పూజారి.. జ్యోతిష్యం పేరుతో చేసే పని తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆ పేరుతో రెండు కోట్లు వసూలు చేసి ఊడాయించాడు. ఇంతకి ఏం జరిగిందంటే..
తాజాగా వేములవాడలో జ్యోతిషం చెపుతూ వచ్చే ఓ పూజరి.. అమాయక ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టించి నమ్మించి మోసం చేసాడు. ఈ క్రమంలోనే అధిక వడ్డీల పేరుతో రెండు కోట్లు వసూలు చేసి ఊడాయించాడు. కాగా, ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జ్యోతిషం చెప్పే మహేష్ రెండు కోట్ల రూపాయలతో పరారయ్యాడు. అయితే ఇతను గత కొంతకాలం వేములవాడలోని అంభాబాయ్ అలయంలో పూజారిగా పనిచేసేవాడు. ఇక అక్కడ అలయంలో పూజలతో పాటుగా, జ్యోతిష్యం, వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకి దగ్గర అయ్యాడు. అంతేకాకుండా.. తాను చెప్పినట్లు పూజలు చేస్తే కోరుకున్నది సాధించవచ్చని నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలోనే.. మహేష్ వద్దకి వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో వారికి అధిక వడ్డీ ఆశ చూపించాడు.
ఇక భక్తులకు తాను చెప్పినట్లు డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి, అదే విధంగా కొంతమందికి వడ్డీ ఇస్తూ నమ్మిస్తూ వచ్చాడు. అయితే మహేష్ అధిక వడ్డీ ఇస్తూ ఉండడంతో చాలా మంది మహేష్‌ను నమ్మి డబ్బులు అప్పజెప్పారు. ఇలా డిపాజిట్ కాలం ముగిసిన వారికి డబ్బులు చెల్లించి మళ్ళీ డిపాజిట్ల ఆశ చూపడంతో నగరంలోని చాలమంది రెండు కోట్ల వరకు డిపాజిట్ చేశారు. అలా రెండు కోట్లు వసూలు అయ్యాక వాటిని సర్దుకొని మహేష్ ఉడాయించాడు. ఇకపోతే కొద్ది రోజులుగా జోతిష్యాలయం మూసి ఉండడంతో పాటుగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీంతో వేములవాడలోని వ్యాపారుస్తులు, భక్తులు పూజరి మహేష్ పెట్టుబడులు పెట్టి మోసపోయిన విషయాన్ని తెలియజేసి వారిని తమ డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. మరి, జ్యోతిష్యం పేరుతో ఆ పూజరి చేసిన మోసం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.