iDreamPost
android-app
ios-app

పవన్ బన్నీ తర్వాత తారక్ కోసం ?

  • Published Jul 02, 2021 | 8:31 AM Updated Updated Jul 02, 2021 | 8:31 AM
పవన్ బన్నీ తర్వాత తారక్ కోసం ?

ఇంకా ఆర్ఆర్ఆర్ కొద్దిభాగం మాత్రమే బ్యాలన్స్ ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ చేయబోయే కొరటాల శివ సినిమా మీద దృష్టి సారిస్తున్నారు. మరోవైపు అతను కూడా ఆచార్య వర్క్ ఇంకో రెండు వారాలు పని చేస్తే అయిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. హీరోయిన్ ఎవరనే క్లారిటీ ఇంకా రాలేదు కానీ ప్రస్తుతానికి కియారా అద్వానీ పేరు గట్టిగ వినిపిస్తోంది. పొలిటికల్ టచ్ తో పాటు యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్లస్ మెసేజ్ ఉండేలా ఈసారి శివ మంచి పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా పాన్ ఇండియాని టార్గెట్ చేసి దీన్ని రూపొందించబోతున్నారు. ఇప్పుడో కిక్కిచ్చే అప్ డేట్ వచ్చింది

దాని ప్రకారం టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఈ ఎన్టీఆర్ 30లో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ బోమన్ ఇరానీని తీసుకునే ఆలోచనలో కొరటాల శివ ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆయనైతేనే బరువైన ఓ కీలకమైన పాత్రకు న్యాయం చేస్తారని భావించి ఆ మేరకు సంప్రదింపులు జరిపారట. ఇంకా వ్యక్తిగతంగా కలుసుకోలేదు. కోవిడ్ హడావిడి పూర్తిగా తగ్గాక ఇక్కడ ఆచార్యని ఫినిష్ చేశాక కొరటాల శివ ముంబై వెళ్లే ప్లానింగ్ లో ఉన్నారని తెలిసింది. ఈ పనితో పాటు హీరోయిన్ కూడా ఈ ట్రిప్ లోనే డీల్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలిసింది. పక్కా ప్లానింగ్ తో ఏడాది చివరిలోగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ చేశారట.

అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోమన్ ఇరానీ చేసిన తెలుగు సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. అజ్ఞాతవాసిలో కనిపించేది కాసేపే అయినా అది మారీ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. నా పేరు సూర్య కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా కూడా మన దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపించారు కానీ అక్కడి కమిట్ మెంట్స్ తో పాటు రెమ్యునరేషన్ ఇష్యూ వల్ల కూడా బోమన్ ఇక్కడ ఎక్కువ చిత్రాలు చేయడం సాధ్య పడలేదు. కొరటాల శివ చెప్పిన కథ కనక నచ్చితే నిర్మాత వైపు బోమన్ వైపు పారితోషికం పెద్ద ఇష్యూ కాదు. అఫీషియల్ అయ్యేదాకా చూడాలి ఇది ఎంతవరకు నిజమవుతుందో