Uppula Naresh
Uppula Naresh
గత కొన్ని రోజుల నుంచి టమాటకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో ధర రికార్డ్ స్థాయిలో పెరిగిపోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు టమాటను కొనాలంటేనే భయపడిపోతున్నారు. ప్రాంతాల వారిగా ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాట ధర రూ. 200 నుంచి 250 వరకు పలుకుతోంది. అయితే ఎన్నడు లేనంతగా టమాటకు భారీ స్థాయిలో ధర పెరిగిపోవడంతో ప్రజలు టమాటాను కొనటానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఫొటో గ్రాఫర్ బంపర్ ఆఫర్ ను ప్రకటించాడు. నా స్టూడియోలో ఫొటో దిగితే టమాటలు ఫ్రీ అంటూ తెలిపాడు. దీంతో స్థానికులు అతని స్టూడియోలో ఫొటో దిగేందుకు పోటీ పడుతున్నారట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెంకు చెందిన ఆనంద్ అనే వ్యక్తి గత కొంత కాలంగా స్థానిక సెంటర్ ఓ ఫొటో స్టూడియోను నడిపిస్తున్నాడు. ప్రారంభించిన మొదట్లో బాగానే గిరాకీ వచ్చేది. ఇదిలా ఉంటే.. గతంలో ఇతని ఫొటో స్టూడియో పక్కనున్న ప్రభుత్వ కార్యాలయాలు దూరం అయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఆనంద్ ఫొటో స్టూడియోకి అస్సలు గిరాకీ రావడం లేదు. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇదే సమయంలో టమాట రేట్లు అధికంగా పెరిగాయి. ఇదే మంచి సమయం అనుకున్న ఆనంద్.. ఎలాగైనా సరే నా స్టూడియో పేరు మళ్లీ ప్రజల్లో తెలిసే విధంగా అనేక ప్రయత్నాలు చేశాడు.
ఈ సమయంలోనే అతనిక ఓ ఐడియా తట్టింది. అదేంటంటే? తన ఫొటో స్టూడియోలో 8 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకునే వారికి పావుకిలో టమాట ప్యాకెట్లను ఫ్రీగా అందిస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటనను తెలుసుకున్న స్థానికులు చాలా మంది ఆనంద్ స్టూడియోలో పాస్ పోర్ట్ లు తీసుకోవడానికి పోటీ పడుతున్నారట. ఇప్పుడు ఇదే అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన స్టూడియోలో ఫొటోలు తీసుకునే వారికి పావుకిలో టమాట ప్యాకెట్లను ఫ్రీగా ఇస్తున్న ఆనంద్ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లిన యువకుడు.. వీడియోను ట్విట్ చేసిన సజ్జనార్