iDreamPost
android-app
ios-app

స్టార్ల ఆలోచనలు మార్చనున్న వెబ్ సిరీస్

  • Published Jul 08, 2021 | 8:21 AM Updated Updated Jul 08, 2021 | 8:21 AM
స్టార్ల ఆలోచనలు మార్చనున్న వెబ్ సిరీస్

కరోనా, థియేటర్ల మూసివేత, లాక్ డౌన్, జనాలు ఇంట్లోనే ఉండాల్సి రావడం వీటి సంగతి కాసేపు పక్కనపెడితే ఇంత విపత్కాలంలో బాగా లాభ పడ్డ రంగాలు ఎంటర్ టైన్మెంట్ కి సంబంధించి ఏవైనా ఉన్నాయంటే అందులో మొదటగా చెప్పుకోవలసింది ఓటిటిల గురించే. ఒకవేళ ఈ వైరస్ రాకపోయి ఉంటే ఇంత డిజిటల్ బూమ్ ఇండియాలో ఉండేది కాదన్న మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు ఏదైతే గ్రోత్ చూస్తున్నామో దానికి ఇంకొంచెం ఎక్కువ సమయం పట్టేది. స్మార్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని దూసుకుపోతున్న ఓటిటిలు ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలను వెబ్ సిరీస్ లకు తీసుకొచ్చి వినోదానికి కొత్త డెఫినేషన్ ఇస్తున్నాయి.

ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ వచ్చే నెల నవరస పేరుతో ఒక భారీ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేయబోతోంది. సుప్రసిద్ధ దర్శకులు నటీనటుల కలయికతో రూపొందిన ఈ నవరస కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, రేవతి, అశోక్ సెల్వన్, బాబీ సింహ, గౌతమ్ మీనన్, శ్రీరామ్, అరవింద స్వామి, ప్రసన్న, సిద్దార్థ్, అధర్వ, అంజలి, కిషోర్, ఢిల్లీ గణేష్, రోషిణి లాంటి పేరున్న తారాగణం ఈ 9 ఎపిసోడ్ల నవరసలో భాగం అయ్యారు. షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. నిన్న విడుదల వాటి తాలూకు ఫోటోకు డీటెయిల్స్ తో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetholiganbetMeritking giriş