iDreamPost
android-app
ios-app

రోడ్డుపై లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనాలు

రోడ్లపై వెళుతుండగా వాహనాలు బోల్తా కొడుతుంటాయి. అందులోని సామాన్లు కింద పడిపోతూ ఉంటాయి. చూసేందుకు జనాలకు ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటుంది కానీ.. వాటి వల్ల తీవ్రంగా నష్టపోతుంటారు వ్యాపారులు. తాజాగా విశాఖలో..

రోడ్లపై వెళుతుండగా వాహనాలు బోల్తా కొడుతుంటాయి. అందులోని సామాన్లు కింద పడిపోతూ ఉంటాయి. చూసేందుకు జనాలకు ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటుంది కానీ.. వాటి వల్ల తీవ్రంగా నష్టపోతుంటారు వ్యాపారులు. తాజాగా విశాఖలో..

రోడ్డుపై లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనాలు

రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు పోవడమే కాదూ.. కొన్ని ఆస్తి నష్టాలు కూడా వాటిల్లుతూ ఉంటాయి. ఈ ప్రమాదాల కారణంగా వ్యాపారస్తులు ఎక్కువగా దెబ్బతింటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా గూడ్స్ తో వెళుతున్న లారీలు, ట్రక్కులు బోల్తా పడితే.. తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ఖరీదైన వస్తువులకు డ్యామేజీ అయితే.. ఈ లాస్ ఎవ్వరూ తీర్చలేనిది. అయితే ఏదైనా వాహనం బోల్తా పడితే.. సాయం చేసే వాళ్ల కన్నా.. అందులో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లేవారే ఎక్కువ. విషయం పొక్కేసిందా.. ఊరు ఊరంతా.. సరంజామా మొత్తం ఖాళీ చేసేందుకు లగెత్తుకు వస్తారు. విశాఖ పట్నం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే జరిగింది. లారీ బోల్తా పడటంతో తండోపతండాలుగా వచ్చేశారు.

ఇంతకు ఆ వాహనంలో దొరికిందీ కూరగాయలే.. మరే ఇతర సామాగ్రియే కాదూ. మద్యం బాటిళ్లు. ఈ విషయం తెలిసిన మద్యం బాబులు అక్కడకు వచ్చి సీసాలను లూటీ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతకు ఏమైందంటే..? విశాఖ పట్నంలోని మధురవాడ కొమ్మది వద్ద మద్యం సీసాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. టైర్ పంచర్ కావడంతో ఆ భారీ వాహనం బోల్తా కొట్టింది. ఆనందపురం డిపో నుండి విశాఖ పట్నం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రోడ్డుపై మద్యం బాటిల్స్ పడిపోయాయి. వెంటనే ఆ వార్త దావనంలా ప్రవహించింది. సమీప ప్రాంతాల ప్రజలకు ఈ విషయం చేరిపోయింది. ఇంకేముంది అక్కడకు చేరుకుని బాటిల్స్ తీసుకుని వెళ్లిపోయారు.

నడి రోడ్డుపై మద్యం సీసాలతో కూడిన లారీ బోల్తా పడిందన్న వార్త అందుకున్న పోలీసులు ఆ వాహనం దగ్గరకు చేరుకుని పహారా కాశారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న జనాలను నిలువరించేందుకు వారి తల ప్రాణం తోకకు వచ్చింది. మద్యం సీసాలు రోడ్డు మీద పడిపోయి ఉండటంతో మందు బాబులు.. వాటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేయసాగారు. ఆ బాటిల్స్ తీయొద్దని వారిని వారించారు. అయినప్పటికీ కొంత మంది మద్యం సీసాలను తీసుకుని ఉడాయించారు. భారీ క్రేన్ సాయంతో లారీని యధావిధిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş