iDreamPost
android-app
ios-app

శ్రీవారి సేవలో తరించే ఛాన్స్.. యువ గాయనీ, గాయకులకు మాత్రమే..

కలియుగ దైవంగా కొలవబడుతున్న తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. వ్యయ ప్రయాసలు.. శ్రీవారిని దర్శించి.. మొక్కులు చెల్లించి, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుంటారు. ఆయన సేవలో తరలించాలని భక్తులు భావిస్తుంటారు. అయితే ఆ అవకాశం అందరికీ రాదు. ఇప్పుడు టీటీడీ ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. అది ఎవరికంటే..?

ఆపద మొక్కుల వాడా, అనాధ రక్షకా అంటూ భక్తులు వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు. సాక్షాత్తూ ఆ శ్రీహరి.. కలియుగంలో వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమలలో కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఏడు కొండలపైన ఉన్న తమ ఇష్ట దైవాన్ని తిలకించేందుకు ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తిరుపతిలోని తిరుమలకు వస్తుంటారు. శ్రీనివాసుడ్ని దర్శించుకునేందుకు గంటలు గంటలు భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తూ ఉంటారు. ప్రతి భక్తుడు ఆయనకు ఏదో విధంగా సేవ చేసుకోవాలని తరిస్తుంటారు. సేవ చేసుకోవడం జన్మ జన్మల పుణ్యం అని భావిస్తుంటారు. అంత ఈజీగా ఆ అవకాశం అందరికీ దక్కదు. అన్నమాచార్యులు, వెంగమాంబ లాంటి కొందరు.. తమ కీర్తనలతో ఆయనకు సేవ చేసుకుంటూ తరించిపోయారు.

కలియుగ దైవానికి సేవ చేసుకునే అదృష్ట, అద్భుతమైన అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తోంది. అయితే ఆ అవకాశం యువ గాయని, గాయకులకు మాత్రమే. దాస సాహిత్య ప్రాజెక్టు తరుఫున తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో నిరర్వహించే ఉంజల సేవలో భక్తి గీతాలు ఆలపించడానికి ఔత్సాహిక గాయనీ, గాయకులను ఎంపిక చేయనుంది. ఇందు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్ లైన్లలో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నఅభ్యర్థులు.. టీటీడీ అధికారి వెబ్ సైట్ htpp://apps.tirumala.org/dsp/లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్, ఇతర మాధ్య మాల ద్వారా పంపే దరఖాస్తులు స్వీకరించడవు.

అక్టోబర్ 21 నుండి నవంబర్ 14వ తేదీ వరకు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న గాయని, గాయకులకు నవంబర్ 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు తిరుపతిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికలో పారదర్శకత కోసం  శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా ఈ కార్యక్రమాన్ని షూట్ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న గాయనీ గాయకులు వారికి కేటాయించి సమయానికి హాజరు కావాలని కోరింది. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, మోసగాళ్లను నమ్మవద్దని స్పష్టం చేశారు.