చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద పోస్ట్.. కేసు నమోదు

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సమకాలీన అంశాలపై తరుచు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆయన ఎక్కువగా బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఎక్కువగా పోస్టులు చేస్తారని కొందరు బీజేపీ నేతలు మండిపడుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా చంద్రయాన్-3పై ఓ పోస్ట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ లో ఏముందంటే?.. బ్రేకింగ్ న్యూస్.. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ తీసి పంపిన మొట్టమొదటి ఫోటో ఇదే నంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ పోస్ట్ లో ఓ వ్యక్తి చాయి కలుపుతూ కనిపించాడు. కాగా ప్రకాశ్ రాజ్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారి వివాదాస్పదంగా మారింది. ఆయన పోస్ట్ పై నెటిజన్స్ స్పందించి తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు.

దేశ కోసం శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడి విక్రమ్ ల్యాండర్ ను పంపిస్తే.. ప్రకాశ్ రాజ్ ఇలాంటి పోస్ట్ చేస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇక కొందరు బీజేపీ నేతలు మాత్రం.. ప్రధానిని ఉద్దేశించే ప్రకాశ్ రాజ్ ఈ పోస్ట్ చేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఈ క్రమంలోనే కర్ణాటకలోని హిందు సంఘాలకు చెందిన కొందరు వ్యక్తులు ప్రకాశ్ రాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రయాన్-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద పోస్ట్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదు చేశారు. ఇంతే కాకుండా ఇలాంటి పోస్ట్ చేసిన ఆయనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇదే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యవహారం చివరికి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.

ఇది కూడా చదవండి: హార్ట్ ఎటాక్​పై యుద్ధం.. పునీత్ పేరిట కర్ణాటక ప్రభుత్వం హెల్త్ స్కీమ్!

Show comments