iDreamPost
android-app
ios-app

ప్రకాశంలో ఘోర విద్యుత్‌ ప్రమాదం

ప్రకాశంలో ఘోర విద్యుత్‌ ప్రమాదం

ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం రాపర్ల వద్ద ఘోర విద్యుత్‌ ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తున్న ట్రాక్టర్‌ వేగంగా వెళ్లి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొనడతంతో విద్యుత్‌ వైర్లు తెగి ట్రాక్టర్‌పై పడ్డాయి. ఈ ఘటనలో ట్రాక్టర్‌ ట్రక్కులో ఉన్న వారిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

నాగులుప్పులపాడు మండలం మాచవరం గ్రామానికి చెందిన మహిళలు అదే మండలం రాపర్ల లో మిర్చి కోతలుకు వెళ్లారు. ఉదయం వెళ్లిన వారు కొద్దిసేపటి క్రితం ట్రాక్టర్‌లో తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినిలు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన విషయం తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించనున్నారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet