Idream media
మళ్లీ ఆ చట్టాలను తీసుకువచ్చే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. రైతులు నిరాటంకంగా ఏడాదిపాటు ఆందోళనలు చేసిన తర్వాత సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత నవంబర్‌లో ప్రకటించినా... ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి.
మళ్లీ ఆ చట్టాలను తీసుకువచ్చే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. రైతులు నిరాటంకంగా ఏడాదిపాటు ఆందోళనలు చేసిన తర్వాత సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత నవంబర్‌లో ప్రకటించినా... ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి.
Idream media
వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు అనుమానించినట్లుగానే జరుగుతోంది. మళ్లీ ఆ చట్టాలను తీసుకువచ్చే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. రైతులు నిరాటంకంగా ఏడాదిపాటు ఆందోళనలు చేసిన తర్వాత సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత నవంబర్‌లో ప్రకటించినా… ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తంతు పూర్తయిన తర్వాత మళ్లీ సాగు చట్టాలను తెచ్చే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు వాటిని నిజం చేసేలా పరిస్థితులు నెలకొన్నాయి.
రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోని తరుణంలో సుప్రీంకోర్టు 2021 జనవరిలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సదరు కమిటీ రైతుల ఆందోళన, సాగు చట్టాలపై రైతుల అభిప్రాయాలు, ఆయా చట్టాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వంటి అంశాలను పరిశీలించి నివేదికను సుప్రీం కోర్టుకు ఇవ్వాల్సి ఉంది. తాజాగా సదరు కమిటీ సాగు చట్టాలపై తన నివేదికను సిద్ధం చేసింది. నివేదికలో సదరు కమిటీ పేర్కొన్న అంశాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. రైతుల ఆందోళన కారణంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల మద్ధతు ఉన్నట్లు కమిటి తెలిపింది. మూడుకోట్ల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న రైతు సంఘాల్లో 86 శాతం ఈ చట్టాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.
ఈ కమిటీలో వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ, షేటార్ని సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్‌వాట్, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థకు చెందిన ప్రమోద్ కుమార్ జోషి, భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మన్ ఉన్నారు. భూపిందర్ సింగ్ మన్ ఆ తర్వాత తప్పుకున్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ.. సాగు చట్టాలకు 86 శాతం రైతు సంఘాలు మద్ధతు ఉన్నట్లు తేల్చాయి. మొత్తం 40 సంఘాలు కిసాన్ సమ్మాన్ మోర్చా (కెఎస్‌ఎం)గా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ సంఘాల్లో 86 శాతం సాగు చట్టాలకు అనుకూలంగా ఉన్నట్లు కమిటీ చెప్పడం విశేషం. అంటే మొత్తం 40 రైతు సంఘాల్లో 34 సంఘాలు సాగు చట్టాలకు అనుకూలంగా ఉందని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ చెప్పడం విశేషం.
సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. రైతులకు మేలు చేసే ఆ చట్టాలను మళ్లీ తెస్తామంటూ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఆది నుంచి రైతులు శంకిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా సాగు చట్టాలను మళ్లీ తెచ్చేందుకు అనుకూలమైన నివేదికను సిద్ధం చేయడం గమనార్హం. మొత్తంగా మరికొద్ది రోజుల్లో రద్దు చేసిన మూడు సాగు చట్టాలు మళ్లీ పార్లమెంట్ ముందుకు రావడం, వాటికి ఆమోదం తెలపడం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం లాంఛనమే కావచ్చు. అదే జరిగితే రైతు సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.